వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌తో చంద్రబాబు దోస్తీ: సోనియా విందుకు టిడిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుకు దగ్గరవుతున్నారా? అవుననే అంటోంది జాతీయ మీడియా. యుపిఎ చైర్‌పర్సన్ హోదాలో సోనియా ఈ నెల 13వ తేదీన మిత్రపక్షాలకు విందు ఇస్తున్నారు.

సోనియా విందుకు యుపిఎ భాగస్వామ్య పక్షాలకే కాకుండా కొన్ని ఎన్డిఎ పక్షాలకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఆహ్వనం అందుకున్న పార్టీల్లో తెలుగుదేశం కూడా ఉందని వార్తలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ వార్తాకథనాన్ని మొదటి పేజీలో కొట్టొచ్చినట్లు ప్రచురించింది.

అందుకే ఆ విందు...

అందుకే ఆ విందు...

థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ వంటివాటి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో యుపిఎను బలోపేతం చేసుకోవడానికి సోనియా గాంధీ విందు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బిజెపి, తెలుగుదేశం పార్టీకి మధ్య పొత్తు ముగిసిందని భావిస్తున్నారు. అయితే, ఇంకా పూర్తిగా తెగదెంపులు చేసుకోలేదు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీని సోనియా విందుకు ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

AP special status Protest : Rahul Gandhi joined
అది వింతేమీ కాదు

అది వింతేమీ కాదు

జాతీయ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నవారికి సోనియా తెలుగుదేశం పార్టీని ఆహ్వానించడం పెద్ద వింతేమీ కాదని అంటున్నారు. కొంత కాలంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు మధ్య సాన్నిహిత్యం పెరిగిందని అంటున్నారు. బిజెపికి తెలుదేశం పార్టీ క్రమంగా దూరం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపుగా తెగదెంపులు చేసుకునే పరిస్థితి వచ్చింది.

 సోనియా ఇలా మాట్లాడారు...

సోనియా ఇలా మాట్లాడారు...

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోకసభలో టిడిపి సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. ఆ సమయంలో టిడిపి సభ్యులతో సోనియా మాట్లాడారు. అప్పుడే అది చర్చనీయాంశంగా మారింది. మంగళవారం పార్లమెంటు వెలువల తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రసు సీనియర్ ఎంపీ ఒకరు టిిపి ఎంపీలకు దగ్గరగా ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు.

నాలుగు నెలల క్రితమే..

నాలుగు నెలల క్రితమే..

కాంగ్రెసు, టిడిపిల మధ్య స్నేహం చిగురించడానికి మూడు నెలల క్రితమే పాదులు పడ్డాయని అంటున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉండే పత్రికల్లో బిజెపికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తాకథనాలు రావడాన్ని అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.

English summary
According to media reports - Congress lead UPA Chair person Sonia Gandhi has invited Telugu Desam party to the feast hosting for UPA allies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X