వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ టిడిపికి జూ. ఎన్టీఆర్ లేదా బ్రాహ్మణి: బాబు చాయిస్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Jr NTR or Nara Brahmani To Lead TDP in Telangana

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ముందు తెలంగాణ పార్టీ కార్యకర్తలు అనూహ్యమైన డిమాండ్లు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించాలనేది ఆయన డిమాండ్.

జూనియర్ ఎన్టీఆర్‌కు లేదా నారా బ్రాహ్మణికి తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించాలని తెలంగాణ పార్టీ నాయకుల నుంచి కొంత కాలంగా డిమాండ్ వస్తోంది. అదే బుధవారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో ప్రతిఫలించింది.

ప్రతిపాదనను నారా లోకేష్ ముందు

ప్రతిపాదనను నారా లోకేష్ ముందు

పార్టీ బాధ్యతలు నారా బ్రాహ్మణికి లేదా జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని మీడియా ముఖంగా కూడా కోరారు. తాజాగా అదే ప్రతిపాదనను చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ముందు పెట్టారు. తాజాగా అదే డిమాండును చంద్రబాబు ముందు పెట్టారు.

రెండు పేర్లు చెప్పి చాయిస్...

రెండు పేర్లు చెప్పి చాయిస్...

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రెండు పేర్లు చెప్పి చంద్రబాబుకే చాయిస్ ఇచ్చారు అయితే, ఆ ప్రతిపాదనలపై చంద్రబాబు ఆసక్తి కనబరిచినట్లు లేరు. తెలంగాణలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమేనని, ఇటువంటి స్థితిలో ఆ విధమైన డిమాండ్లు రావడం సహజమేనని అన్నారు. అంతకు మించి ఆయన మాట్లాడలేదు.

చంద్రబాబుకు ఇష్టం లేదు...

చంద్రబాబుకు ఇష్టం లేదు...

నారా బ్రాహ్మణికి గానీ జూనియర్ ఎన్టీఆర్‌కు గానీ తెలంగాణ పార్టీ పగ్గాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదని తెలుస్తోంది. తెలంగాణలో తన కుటుంబ సభ్యులను దించకూడదని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.

ప్రత్యామ్నాయం ఏమిటి...

ప్రత్యామ్నాయం ఏమిటి...

తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో పొత్తుల ద్వారా క్యాడర్‌ను, స్థానిక నాయకత్వాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకుని అవసరమైతే ఆ తర్వాత ప్రభుత్వంలో చేరాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
It is sais that Andhra Pradesh CM and Telugu Desam Party chief Nara Chandrababu Naidu is not interested on Jr NTR or Nara Brahmani leadership in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X