బరువు తగ్గడానికి నీటి ఉపవాసం సులువైన మార్గమా? ప్రాణాలకే ప్రమాదమా?
బరువు తగ్గాలనే కోరికతో నేటి యువత ఏం చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు. తమ అందం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. బరువు తగ్గడానికి ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ట్రెండ్స్ యువత ప్రాణాలకే ప్రమాదంగా మారుతున్నాయి. అలాంటి ఘటనే కేరళలో జరిగింది. 18 ఏళ్ల అమ్మాయి ఆన్‌లైన్‌లో చూసిన వీడియోను నమ్మి, కొన్ని నెలల పాటు నీళ్లు మాత్రమే తాగి ప్రాణాలు కోల్పోయింది.
నీటి ఉపవాసం- నిజమెంత?
నీటి ఉపవాసం అంటే, కొన్ని రోజుల పాటు ఆహారం మానేసి కేవలం నీళ్లు మాత్రమే తాగడం. ఈ విధానం ద్వారా వేగంగా బరువు తగ్గవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది ఎంత ప్రమాదకరమో చాలా మందికి తెలియదు. కొన్ని పరిశోధనల ప్రకారం, నీటి ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని కణాలు తమను తాము శుద్ధి చేసుకుంటాయి. దీన్నే 'ఆటోఫాగి' అంటారు. అయితే, ఈ ప్రయోజనాలు చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటాయి.

72 గంటలు దాటితే ప్రమాదమే!
సాధారణంగా, నీటి ఉపవాసం 24 నుంచి 72 గంటల వరకు మాత్రమే చేయాలి. అంతకంటే ఎక్కువ రోజులు చేస్తే, అది ప్రాణాంతకం కావచ్చు. ఎక్కువ కాలం చేస్తే ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. వాటర్ తాగడం 72 గంటలు దాటితే ఆరోగ్యానికి ప్రమాదం. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం) స్థాయిలు పడిపోతాయి. డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) వస్తుంది. రక్తపోటు, చక్కెర స్థాయిలు పడిపోతాయి. గుండె పనితీరు మందగిస్తుంది. కండరాలు బలహీనపడతాయి. కిడ్నీలు దెబ్బతింటాయి. చివరికి ప్రాణాలు కూడా పోవచ్చు. మొదటిసారి నీటి ఉపవాసం ప్రయత్నించే వారికి, బలహీనత, మైకము మరియు తక్కువ రక్తపోటు సాధారణ దుష్ప్రభావాలు తలెత్తుతాయి.
ఎవరికి ప్రమాదం?
నీటి ఉపవాసం 72 గంటల మించితే ఆరోగ్యానికి ప్రమాదమే. గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఆనారోగ్యాలకు గురైయ్యే అవకాశం ఉంది. గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నవారు నీటి ఉపవాసానికి దూరంగా ఉండటం మంచిది. నీటి ఉపవాసం చేయాలనుకుంటే, ముందుగా డాక్టర్‌ను సంప్రదించాలి. క్రమంగా ఆహారం తగ్గించాలి, ఒకేసారి మానేయకూడదు. పుష్కలంగా నీళ్లు తాగాలి. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఉపవాసం ఆపేయాలి.
ఉపవాసం తర్వాత వెంటనే భారీగా ఆహారం తీసుకోకూడదు. రీఫీడింగ్ సిండ్రోమ్ అనేది ప్రాణాంతకమైన పరిస్థితి. ఇది ఉపవాసం తర్వాత త్వరగా ఆహారం తినడం వలన వస్తుంది. కావున ఉపవాసం ముగించిన తర్వాత ఆహారం నెమ్మదిగా తీసుకోవాలి.
కేరళ ఘటన: పాఠం నేర్చుకోవాలి
కేరళలో జరిగిన విషాద ఘటన ప్రతి ఒక్కరికీ హెచ్చరిక. సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్స్‌ను గుడ్డిగా నమ్మవద్దు. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకోండి. ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. తగినంత నిద్ర పోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. డాక్టర్ సలహా తీసుకోండి. బరువు తగ్గడం ముఖ్యం కాదు, ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, ప్రాణాలతో చెలగాటం ఆడకండి.












Click it and Unblock the Notifications