Paracetamol: పారాసెటమాల్ అధికంగా వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!
చాలా మంది కాస్త జ్వరం రాగానే ట్యాబ్లెట్లు వాడుతుంటారు. వైద్యుల సలహా తీసుకోకుండానే మెడికల్ షాప్ కు వెళ్లి గోలిలు తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది పారాసెటమాల్ ఎక్కువగా వాడుతున్నారు. కరోనా నుంచి దాదాపు అందరి ఇళ్లలో పారాసెటమాల్ గోలీలు ఉంటున్నాయి. అందుకే పారాసెటమాల్ ను విరిగా వాడుతున్నారు. అయితే ఇలా అతిగా ట్యాబ్లెట్లు వాడడడం మంచి కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పారాసెటమాల్ తో పాటు యాంటి బయోటిక్స్ కూడా ఎక్కువగా వాడొద్దని చెబుతున్నారు.
సాధారణంగా జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకుంటారు. అయితే పారాసెటమాల్ వేసుకున్న తర్వాత జ్వరం తగ్గకుంటే వెంటే మరో ట్యాబ్లెట్ వేసుకొవద్దని చెబుతున్నారు. జ్వరం వచ్చిన 4 నుంచి 6 గంటల తర్వాత పెద్దలకైతే 650 ఎంజీ, 12 ఏళ్లకంటే తక్కువ వయస్సున్న వారికి 15 ఎంజీ పారాసెటమాల్ తీసుకొవచ్చు. ట్యాబ్లెట్ వసుకున్న తర్వాత అర గంట నుంచి దాని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అయితే చాలా మంది ఇష్టమొచ్చినట్లు ట్యాబ్లెట్లు వాడుతున్నారు.

పారాసెటమాల్ టాబ్లెట్లను పరిమితికి మించి తీసుకోవడం వల్ల అధిక చెమటలు, మోషన్స్, కళ్లు తిరగడం, వాంతులు, చర్మ సంబంధిత సమస్యలు, ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి, అలర్జీలు వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లలో స్టెరాయిడ్స్ ఉంటాయని వీటిని ఎక్కువగా తీసుకుంటే మూత్ర పిండాలు, కాలేయం వంటి అవయవాలపై ప్రభావం చూపుతాయట. మూత్ర పిండాలు, కాలేయం సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న వారైతే వైద్యులను సంప్రదించకుండా పారాసెటమాల్, డోలో, క్రోసిన్ వంటి టాబ్లెట్లను వాడొద్దని చెబుతున్నారు.
చాలా మంది త్వరగా జ్వరం తగ్గాలని యాంటీ బయోటిక్స్ వాడతారు. యాంటీ బయెటిక్స్ ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలంలో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. బాక్టిరియా, వైరస్ యాంటీ బయెటిక్స్ అలవాటుపడి అవి మొండిగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడొద్దని చెబుతున్నారు. వైద్యులను సంప్రదించిన తర్వాతే మందులు వాడాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications