Sravana Masam: శ్రావణ మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినొద్దు?.. అసలు కారణం ఇదే?
Sravana Masam 2025: సనాతన సంప్రదాయంలో శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నలువైపులా భక్తి వాతావరణం నెలకొంటుంది. అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ శ్రావణ మాసం శివుడికి అంకితం చేయబడింది. ఈ సమయంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారు. నేటి (శుక్రవారం) నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. శ్రావణ మాసంలో శివ భక్తులు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని భక్తిశ్రద్ధలతో పాటిస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. శ్రావణ మాసంలో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు నాన్‌వెజ్ తినొద్దని పెద్దలు చెబుతుంటారు. కానీ ఈ సంప్రదాయం వెనుక మతపరమైన కారణాలు మాత్రమే కాకుండా శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని తెలుసా?
ఇప్పుడు, శ్రావణ మాసంలో మాంసాహారం సేవించకపోవడానికి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను తెలుసుకుందాం. శ్రావణమాసం వర్షాకాలంలో వస్తుంది కనుక సూర్యరశ్మి, వెళుతురు ఎక్కువగా ఉండదు. కాబట్టి మన శరీరంలో జీర్ణక్రియ వేగంగా జరగదు. ఆయుర్వేదం ప్రకారం, వర్షాకాలంలో జీర్ణశక్తి బలహీనపడుతుంది. దీనివల్ల భారీ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం కష్టం అవుతుంది. వేద గ్రంథాలలో వర్షాకాలంలో ఆహారం, జీవనశైలికి నియమాలు రూపొందించబడ్డాయి. ఆకుకూరలు, కూరగాయలపై కూడా ఆహారంలో ఆంక్షలు విధించబడతాయి. ఎందుకంటే వాటిలో పురుగులు ఉండవచ్చు. జీర్ణశక్తి బలహీనపడడం వల్ల ఏం తిన్నా కూడా అరగడానికి చాలా సమయం అవసరం. అందుకే మాంసం వంటి కఠినమైన ఆహారాన్ని మన శరీరం ఈ కాలంలో జీర్ణం చేసుకోవడం కష్టంగా మారుతుంది. కావున శ్రావణ మాసంలో శాకాహారం తినడం మంచిదని నమ్మకం.

వర్షాకాలంలో నీరు మరింత కలుషితమవుతుంది. ఈ వాతావరణంలో నీటిలో నివసించే చేపలు లేదా కలుషిత నీటిపై ఆధారపడిన అనేక జంతువులు తెలియకుండానే వివిధ నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు గురవుతాయి. అందుకే చేపలు, రొయ్యలు లాంటి నాన్ వెజ్ ఆహార పదార్థాలు తినకూడదు.ఈ వాతావరణంలో మాంసం-చేపలు త్వరగా కుళ్లిపోతాయి. వీటిలో బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందవచ్చు. అందువల్ల దీనిని సేవించడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపు సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
మాంసం-చేపలు ఎందుకు నిషేధం?
మాంసం-చేపలను కఠినమైన ఆహారంగా పరిగణిస్తారు. దీని వెనుక ఉన్న తర్కం ఏమిటంటే.. ఈ ఆహారాన్ని సేవించడం వల్ల సోమరితనం, బద్ధకం, అహంకారం, కోపం పెరుగుతాయి. ఈ కారణాలన్నింటి వల్ల ప్రజలు ఆధ్యాత్మికత నుండి దూరం అవుతారు. ఇంద్రియాలను నియంత్రించుకోవడానికి ఆహారంపై నియంత్రణ అవసరం అని చెప్పబడింది. ఇటువంటి ఆహారాలు సాత్వికతను దూరం చేస్తాయి. పూజ సమయంలో ఏకాగ్రత దెబ్బతింటుంది. ఈ కారణాలన్నింటి వల్ల నాన్ వెజ్ నిషేధించబడింది.












Click it and Unblock the Notifications