వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణిని విమానంలో నుంచి చూశారు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి హాంకాంగ్‌ వెళ్తున్న విమాన ప్రయాణికులకు ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి కనిపించిందని అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ రెక్స్‌ టిల్లర్సన్‌ వెల్లడించారు. ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత నవంబరులో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ వివరాల ప్రకారం.. విమానం క్షిపణి ప్రయోగ ప్రాంతానికి 280 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉంది. ఆ సమయంలో అంతే ఎత్తులో మరో 9 విమానాలు ప్రయాణిస్తున్నాయి.

Hong Kong bound flight saw North Korean missile

హాంకాంగ్‌ వెళ్తున్న విమానంలోని సిబ్బంది తాము క్షిపణి రీ ఎంట్రీ చూసినట్లు చెప్పారని టిల్లర్సన్‌ తెలిపారు. ఆ ప్రయోగం కారణంగా విమానం దారి మళ్లించుకుందన్నారు. అయితే ఆ విమానం ఏ ఎయిర్ లైన్స్‌కు చెందిందో చెప్పలేదు.

ఉత్తర కొరియా ఈ విధంగా ఏ సమయంలోనైనా క్షిపణి ప్రయోగాలు చేపట్టడం అన్ని దేశాల పౌరులకు ఎంతో ప్రమాదకరమని, ప్రతి రోజు అక్కడి ఎయిర్ స్పేస్‌ నుంచి ఎన్నో విమానాలు ప్రయాణిస్తుంటాయన్నారు.

లాస్‌ఏంజెల్స్‌, శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి బయలుదేరిన కొరియన్‌ ఎయిర్‌కు చెందిన విమానాల సిబ్బంది కూడా తాము గాల్లో వెలుగు చూసినట్లు చెప్పారు. ఉత్తర కొరియాకు నిధుల విషయంలో కట్టడి చేయాలని మిత్ర దేశాలను కోరిన సందర్భంలో టిల్లర్సన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

English summary
A North Korean intercontinental ballistic missile launch in November was witnessed by passengers on a San Francisco-to-Hong Kong commercial flight, highlighting the "recklessness" of Kim Jong Un's regime, U.S. Secretary of State Rex Tillerson said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X