వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంపడానికే రాడ్స్ జొప్పించారు, ప్రతి చర్యా: జడ్జి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిందితులు నిస్సహాయురాలైన బాధితురాలిని చంపేశారని సాకేత్ ఫాస్ట్ కోర్టు న్యాయమూర్తి 23 ఏళ్ల నిర్భయ అత్యాచారం, హత్య కేసు తీర్పులో వ్యాఖ్యానించారు. ప్రణాళిక ప్రకారమే ఆమెను హత్య చేశారని అన్నారు. సామూహిక అత్యాచారం, అసహజ నేరాలు, సాక్ష్యాల మాయం చేయడం, హత్య నేరాలకు పాల్పడ్డారని చెప్పారు.

తీర్పు సందర్భంగా కోర్టు హాల్ క్రిక్కిరిసిపోయింది. జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు పెద్ద యెత్తున వచ్చారు. న్యాయమూర్తి 237 పేజీల తీర్పును ఇచ్చారు. ఇనుప రాడ్లను వాడిన తీరు, గాయపరిచిన తీరు రాడ్స్‌ను అమ్మాయిని అదుపులోకి తెచ్చుకోవడానికి మాత్రమే చేసింది కాదని అర్థమవుతోందని అన్నారు. సామూహిక అత్యాచారం కోసం మాత్రమే రాడ్స్‌ను లోనికి జొప్పించి, లోపలి భాగాలను బయటకు లాగారని చెప్పడానికి లేదని, ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే లోపలి అవయవాన్ని బయటకు లాగారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

Gang Rapists

దేహంపై గాయపరచడమే కాకుండా రాడ్‌ను పదే పదే లోనికి జొప్పించి బయటకు లాగారని, చేతితో లోని కీలకమైన అవయవయాన్ని బయటకు లాగారని, ఆమెను చంపే ఉద్దేశంతోనే ఆ పనిచేశారని అన్నారు. ఐరన్ రాడ్‌ను వాడడం వల్ల నిర్భయ లోని అవయవాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఆ తర్వాత ఆమెను, ఆమె మిత్రుడిని బస్సులోంచి బయటకు తోసేశారు. నగ్నంగా, రక్తమోడుతూ వారు బయటపడిపోయారు. ఇదంతా వారిని చంపడానికే చేశారని న్యాయమూర్తి అన్నారు.

దేహంలోపల 18 గాయాలున్నాయని, అంతగా గాయపరచడం ఆమెను చంపడానికి చేసినవి మాత్రమేనని న్యాయమూర్తి అన్నారు. నిరుడు డిసెంబర్ 16వ తేదీన వైద్య విద్యార్థినిపై ఢిల్లీలో నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.

English summary
Pronouncing four men guilty of raping and murder the 23-year-old physiotherapy trainee in December last, the judge today said they had murdered a "helpless victim". He also called it a planned act with the intention of causing death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X