వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఎన్నికలు: యాక్టర్ మనోజ్ తివారీకి బిజెపి టికెట్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Manoj Tiwari tipped to get ticket from BJP
న్యూఢిల్లీ: ఢిల్లీ శానససభ ఎన్నికల్లో భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీని పోటీకి దించేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 30 లక్షల మందికిపైగా పూర్వంచల్ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఆయన కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. బిజెపి నాయకులతో పలుమార్లు మనోజ్ తివారీ సమావేశమైనట్లు తెలుస్తోంది.

బిజెపిలో చేరే విషయాన్ని ఆయన అంగీకరించడం లేదు, అలాగని కొట్టేయడం లేదు. అయితే తాను బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు విజయ్ గోయల్‌ను కలిశానని, అది మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని, ద్వారకలోని తన కార్యక్రమాన్ని చూడడానికి గోయల్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసిందని ఆయన అన్నారు.

గోయల్ కూడా ఆ విషయంపై ఏమీ మాట్లాడడం లేదు. అయితే, పూర్వాంచల్ వోటర్లను తమతో పాటు తీసుకుని వెళ్లాలని భావిస్తున్నామని అన్నారు. మనోజ్ తివారీ విషయంపై జాతీయ నాయకులతో చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. 2009లో మనోజ్ తివారీ గోరక్‌పూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున లోకసభకు పోటీ చేశారు.

మనోజ్ తివారీ బిజెపిలో చేరుతారని 2011లోనే ప్రచారం సాగింది. ఆ ఏడాది జూన్ 4వ తేదీన రామ్‌దేవ్ బాబా రామ్ లీలా మైదానంలో చేపట్టిన ప్రదర్శనకు ఆయన హాజరయ్యారు. ఛత్ పూజ రోజును ఢిల్లీలో సెలవుగా ప్రకటించే ఆలోచన ఉందని బిజెపి ప్రకటించింది.

English summary

 There is a strong speculation that Bhojpuri actor Manoj Tiwari, currently with Samajwadi Party, will join its ranks and contest in the Delhi assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X