వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపిలోకి రాజ్యవర్ధన్, దివ్య: కాంగ్రెస్‌కు బిధురి ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajyavardhan Singh Rathore
జైపూర్/న్యూఢిల్లీ: ప్రముఖ షూటర్, 2004 ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. రాజకీయాల్లో చేరేందుకు అతను ఇండియన్ ఆర్మీ నుండి వాలంటరీ రిటర్మెంట్ తీసుకున్నారు. 43 ఏళ్ల రాథోడ్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్‌ల ఆధ్వర్యంలో జైపూర్‌లో చేరారు.

ఈ సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ.. దేశం క్లిష్టంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో తాను స్పందించకుండా ఉండలేనని చెప్పారు. మోడీ దేశాన్ని నడిపించే నిర్ణయాత్మక నాయకుడన్నారు. ప్రస్తుతం రాజకీయాలను, నాయకులను ద్వేషిస్తున్నారని తనకు తెలుసునని కానీ, నిస్వార్థంగా పనిచేసే వారి పట్ల ఇప్పటికీ తనకు నమ్మకముందన్నారు. తాను దేశానికి 23 ఏళ్లు సేవ చేశానని చెప్పారు. రాథోడ్‌తో పాటు జైపూర్ రాజకుటుంబానికి చెందిన దివ్య సింగ్ కూడా బిజెపిలో చేరారు.

కాంగ్రెస్‌కు బిధురి షాక్

గుజ్జర్ నేత, ఢిల్లీ ఎన్సిపి మాజీ అధ్యక్షుడు రాంవీర్ సింగ్ బిధురి కాంగ్రెసు పార్టీకి షాకిచ్చారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆయన ముగ్గురు ఎన్సీపి కౌన్సెలర్లతో పాటు బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ ఎన్నికల వ్యవహారాల ఇంఛార్జ్ నితిన్ గడ్కరీల సమక్షంలో ఆయన బిజెపిలో చేరారు.

ఈ నెల 6వ తేదిన బిధురి కాంగ్రెసు పార్టీలో చేరాల్సి ఉంది. అందుకోసం ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కానీ, దానికి బిధురి హాజరు కాలేదు. ట్రాఫిక్ స్తంభించడంతో దానికి రాలేకపోయినట్లు ఆ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చెప్పారు. కానీ, అంతలోనే బిధురి బిజెపిలో చేరారు.

English summary
Ace shooter and former Olympic silver medallist Rajyavardhan Singh Rathore on Tuesday decided to take a shot at politics as he joined the BJP after taking voluntary retirement from the Indian Army.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X