వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ గ్యాంగ్ రేప్: నిర్దోషినంటూ అరిచిన ఒకతను

By Pratap
|
Google Oneindia TeluguNews

One of the convicts shouts 'I am innocent
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థిని నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు దోషులకు శిక్షను ఖరారు చేయడానికి బుధవారం ఉదయం సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. బుధవారం వారికి శిక్షను ఖరారు చేయనుంది.

దోషులకు మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్ న్యాయమూర్తి ముందు అన్నారు. దోషులను కోర్టుకు తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా దోషులుగా తేలినవారిలో ఒకతను తాను నిర్దోషినని గట్టిగా అరిచాడు. రెండు సార్లు అతను గట్టిగా అరిచి ఆ మాట అన్నాడు. దోషులకు మరణశిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు, తమకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని నిర్భయ తండ్రి అన్నారు.

ఆ వ్యక్తులను కాల్చి చంపాలని నిర్భయ చివరి అన్నదని ఆయన చెప్పారు. ఆమెకు దీంతో సంతృప్తి కలుగుతందని భావిస్తున్నానని ఆయన అన్నారు. నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో వినయ్ శర్మ, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించింది.

వైద్య విద్యార్థినిపై నిరుడు డిసెంబర్ 16వ తేదీన అత్యంత కిరాతకంగా బస్సులో అత్యాచారం జరిగింది. ఆమె సింగపూర్ ఆస్పత్రిలో ఆ తర్వాత మరణించింది. ఈ కేసులో ఆరుగురు నిందితులుగా ఉన్నారు. ఆరుగురిలో ప్రథమ ముద్దాయి రాంసింగ్ మరణించాడు. మరో వ్యక్తి మైనర్ కావడంతో అతనిపై బాలనేరస్థుల కోర్టు విచారణ జరిపింది.

English summary
A Delhi court may today pronounce the quantum of sentence for the four convicts in the Nirbhaya gang-rape case, a day after holding them guilty of rape and murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X