• search
  • Live TV
keyboard_backspace

International Day of Peace:ఉమ్మడి శతృవు కరోనాను తరిమికొడదాం.. ఈ రోజు విశిష్టత ఏంటి..?

అంతర్జాతీయ శాంతి దినోత్సవం లేదా ప్రపంచ శాంతి దినోత్సవంను ఏటా సెప్టెంబర్ 21వ తేదీన జరుపుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకుని ప్రారంభించింది. ప్రపంచంలో యుద్ధాలు, హింస లేకుండా ఉండేందుకు పలు అవగాహన కార్యక్రమాలు ప్రపంచ దేశాలు ఈ రోజున నిర్వహిస్తాయి. శాంతితో కూడిన జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందాలనే మంచి ఉద్దేశం ఈ కార్యక్రమం వెనక ఉంది. అంతేకాదు యుద్ధ భూమిలో నివసిస్తున్న ప్రజలు నిత్యం భయంతో గడుపుతున్నారు. అలాంటి వారికి శాంతి గురించి తెలపడం శాంతియుత జీవితం గురించి చెప్పడం ఎంతో అవసరం. అందుకే సెప్టెంబర్ 21వ తేదీన అంతర్జాతీయ శాంతియుత దినోత్సవంగా జరుపుకుంటాం. అంతేకాదు ఐక్యరాజ్య సమితి ఈ రోజున సెలవుదినంగా ప్రకటించడం జరిగింది. ఇక అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం ఎలా వచ్చింది దీని చరిత్ర ఏంటనేదానిపై తెలుసుకుందాం.

ప్రతి రోజు ఏదో ఒక దినోత్సవంను ప్రపంచం లేదా దేశం జరుపుకుంటోంది. అయితే అన్నిటికంటే ముఖ్యం ప్రపంచమంతా సంతోషంగా ఉంటేనే అన్ని రోజులు వేడుకలు చాలా ఆనందంగా జరుపుకోగలం. కానీ ప్రపంచంలో ఏదో ఒక మూలన యుద్ధ వాతావరణం ఉండనే ఉంటోంది. తాజాగా అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యమేలుతోంది. అక్కడ ఎంతటి హింసను అక్కడి ప్రజలు అనుభవిస్తున్నారో వారి బాధలు వర్ణించడం సాధ్యంకాదు. తాలిబన్ల తుపాకీ నీడలో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. ఏ క్షణం ఏ తుపాకీ నుంచి ఏ బుల్లెట్ ఎవరి గుండెల్లోకి దూసుకెళుతుందోనేమో అని భయంతో కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అంతర్జాతీయ శాంతియుత దినోత్సవంకు ప్రాధాన్యత ఏర్పడింది.అయితే అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం 2001లో తొలిసారిగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఏటా నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి

International Day of Peace 2021:know its importance, History and significance and theme

అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం తేదీ చరిత్ర

1981లో ఐక్యరాజ్యసమితి శాంతియుత దినోత్సవంకు ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించింది.తొలిసారిగా 1982లో సెప్టెంబర్ మూడవ మంగళవారం రోజున అంతర్జాతీయ శాంతియుత దినోత్సవంను నిర్వహించింది.2001లో సెప్టెంబర్ 11న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని భావించారు. అందులో అప్పటి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ ఓ సందేశం పంపారు. సెప్టెంబర్ 21వ తేదీన అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం జరుపుకోవాలని సందేశంలో పేర్కొన్నారు.

2001 సెప్టెంబర్ 11వ తేదీన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనగా అమెరికాపై ఉగ్రవాదులు దాడులు చేశారు. అక్కడే అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం జరుపుకోవాలనే ఆలోచన కోఫీ అన్నన్‌కు తట్టింది. దీంతో అప్పటి నుంచి ఏటా సెప్టెంబర్ 21వ తేదీన అంతర్జాతీయ దినోత్సవంను జరుపుకోవాలని నిర్ణయించారు. అంతకుముందు ఇది సెప్టెంబర్ నెలలో మూడవ మంగళవారం రోజున నిర్వహించేవారు. అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి పీస్‌ బెల్‌ను ప్రధానకార్యాలయం వద్ద మోగిస్తారు. ఈ గంటను ఆఫ్రికా ఖండం తప్పితే మిగితా ఖండాల్లోని పిల్లలు దానం చేసిన కాయిన్స్‌ నుంచి తయారు చేయడం జరిగింది. ఎల్లవేళలా ప్రపంచమంతా శాంతితో ఉండాలని బెల్‌కు ఓ వైపు రాసి ఉంటుంది.

అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం 2021 థీమ్

ఏటా అంతర్జాతీయ శాంతియుత దినోత్సవంకు ఒక థీమ్‌ ఉంటుంది. ఈ థీమ్ ఆధారంగా మంచి చర్చలు నిర్వహించడం జరుగుతుంది. ఈ థీమ్ చాలా సులభంగా అందరికి అర్థమయ్యేలా.. దీని చుట్టూ అర్థవంతమైన చర్చ జరిగేలా రూపొందిస్తారు. 2021 అంతర్జాతీయ శాంతియుత దినోత్సవం థీమ్ "Recovering Better for an Equitable and Sustainable World" దీనర్థం సుస్ధిరమైన ప్రపంచం కోసం వేగంగా కోలుకోవడం. గతేడాది షేపింగ్ పీస్ టుగెదర్ అనే థీమ్ సెలెక్ట్ చేశారు. గత ఏడాది నుంచి కరోనాతో ప్రపంచం పోరాడుతోంది. ఒకరికొకరం శత్రువులుగా అయితే లేము కానీ... అందరికి కరోనా ఉమ్మడి శతృవుగా మారింది. ఈ ఏడాది థీమ్ చాలా స్పష్టంగా ఉంది. కరోనా అందరికీ ఎంతో ప్రమాదకరంగా మారుతూనే ఎన్నో పాఠాలను నేర్పింది. ఇక భూమికి ఒకవైపు ఈ వైరస్ సోకితే మరోవైపు కూడా ప్రమాదబారిన పడుతోంది.

అంతర్జాతీయ దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ప్రజలకు ఓ సందేశాన్నిస్తోంది. మానవాళికి మంచితనం, శాంతి, దయాగుణం, జాలి,ప్రేమతో జీవించాలనే సందేశాన్నిచ్చింది. ప్రస్తుతం కరోనావేళ ప్రతి మనిషి ఇవన్నీ అలవర్చుకోవాలని సూచించింది. కరోనా వచ్చిన వ్యక్తిని సోదరభావంతో ప్రేమించాలే తప్ప.. అతన్ని లేదా ఆమెను మరో దృష్టితో చూడరాదని పేర్కొంది.

English summary
International Day of Peace is observed annually on September 21 to spread awareness among people that we are not each other's enemies.
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X