వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీటెక్/డిప్లొమా చేశారా.. అయితే ఏర్పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు మీకోసం..!!

|
Google Oneindia TeluguNews

ఏర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ఇంజినీరింగ్ డిప్లొమా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 31 అక్టోబర్ 2021.

ఇక ఖాళీల వివరాలకు వస్తే.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 30 ఉండగా.. ఇంజినీరింగ్ డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు 36 ఉన్నాయి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఏరోనాటిక్స్/ఏరోస్పేస్/ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఇంజినీరింగ్ డిప్లొమా అప్రెంటిస్‌లకు సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఏరోనాటిక్స్ ఇంజినీరింగ్,ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి.

AAI Recruitment 2021: Apply for Apprentice posts

సంస్థ పేరు: ఏర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ఇంజినీరింగ్ డిప్లొమా అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 66
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 అక్టోబర్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్‌లో ఆయా శాఖల్లో డిగ్రీ/డిప్లొమా

వయస్సు: 30 సెప్టెంబర్ 2021 నాటికి గరిష్టంగా 26 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్టు చేస్తారు. ఆపై ఇంటర్వ్యూ/ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 అక్టోబర్ 2021

మరిన్ని వివరాలకు

English summary
Airport Authority of India had released a job notification to fill up Apprentice posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X