వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్రీ పూర్తి చేశారా.. అయితే ఎయిరిండియాలో ఉద్యోగాలకు అప్లయ్ చేయండి..

|
Google Oneindia TeluguNews

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్. ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు AIESL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 23 ఆగష్టు 2021.

అకౌంట్స్ ఆఫీసర్‌ పోస్టులు మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఇవి హైదరాబాదులో ఒక పోస్టు, కోల్‌కతాలో ఒక పోస్టు, ఢిల్లీలో 2 పోస్టులు, ముంబై లో 2 పోస్టులను భర్తీ చేస్తారు. ఇక అకౌంట్స్ అసిస్టెంట్‌కు సంబంధించి 12 పోస్టులు ఉన్నాయి. ఇవి హైదరాబాదులో 2 పోస్టులు ఉండగా, కోల్‌కతాలో 2 పోస్టులు ఢిల్లీ, ముంబైలో చెరో నాలుగు పోస్టులను భర్తీ చేస్తారు.

AIESL Recruitment 2021: Apply for Accounts officer and Accounts assistant posts

అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ.80000 వేతనం ఇస్తుండగా... అకౌంట్స్ అసిస్టెంట్‌గా రూ.25వేలు వేతనంగా నిర్ణయించారు. విద్యార్హత విషయానికొస్తే అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ చార్టర్డ్ అకౌంటెంట్/ ఇంటర్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ లేదా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఫినాన్స్‌ ప్రధాన సబ్జెక్టుగా ఎంబీఏలో ఉత్తీర్ణులై ఉండాలి. అకౌంట్స్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అనుభవం విషయానికొస్తే ఆయా పోస్టులకు సంబంధించి మూడేళ్ల పని అనుభవం తప్పనిసరి. అదికూడా ఏదైనా ఒక ఎయిర్‌లైన్ సంస్థలో పనిచేసి ఉండాలి. ఈఎస్‌ఐసీ, పీఎఫ్, వెల్ఫేర్ ఫండ్, ప్రొఫెషనల్ టాక్స్ జీఎస్టీ పై అవగాహన ఉండాలి. ఏవియేషన్ ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక అకౌంట్ అసిస్టెంట్లకు ఈఎస్‌ఐసీ, పీఎఫ్, వెల్ఫేర్ ఫండ్, ప్రొఫెషనల్ టాక్స్ జీఎస్టీలో అనుభవం ఉండాలి. ఇక్కడ కూడా ఎయిర్‌లైన్‌ సంస్థతో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

అకౌంట్స్ ఆఫీసర్‌కు 1 ఆగష్టు 2021 నాటికి 30 ఏళ్లు వయసు మించి ఉండరాదు. అకౌంట్స్ అసిస్టెంట్‌కు 1 ఆగష్టు 2021 28 ఏళ్లు మించి ఉండరాదు. ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులు సంస్థకు సంబంధించిన అన్ని ఆర్థిక పరమైన అంశాలను చూసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్టు చేసి వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు ముందుగా ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడతారు. ఆ తర్వాత మరో రెండేళ్ల పాటు పొడిగించే అవకాశాలున్నాయి.

అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అక్కడ అప్లికేషన్ ఫారంను డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని పూర్తి చేసి దిగువ ఇచ్చిన అడ్రస్‌కు పంపాలి.

Post Applied for Accounts Officer/ Accounts Assistant
AIESL
Personnel Department,
2nd Floor, CRA Building, Safdarjung Airport Complex,
Aurbindo Marg, New Delhi - 110 003

పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ 23 ఆగష్టు 2021. మరింత సమాచారం కోసం: https://www.airindia.in/careers.htm

English summary
AIESL has issued fresh notification to fill up Accounts officer and Accounts Assistant vacancy post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X