వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఎస్సై రాత పరీక్ష హాల్ టికెట్ల విడుదల: డౌన్‌లోడ్ చేసుకోండిలా!

ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్లను ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం విడుదల చేసింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పరీక్షకు హాల్ టికెట్లను ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల లోగా తమ అధికారిక వెబ్‌సైట్ లింక్ https://slprb.ap.gov.in/UI/SIHT ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ఫిబ్రవరి 19న జరగనుంది. తొలి పేపర్ ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

Andhra Pradesh police SI recruitment preliminary exam hall tickets released

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గత నవంబర్ నెలలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన ఇవ్వగా.. మొత్తం 1,73,047 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 421 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 1,40,453 మంది పురుషులు దరఖాస్తు చేసుకోగా, 32,594 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రిలిమినరీ పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరావాల్సి ఉంటుంది. కాగా, ఎస్సై పరీక్ష మొదటి పేపర్‌లో రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.
సెకండ్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్‌లో జనరల్ స్టడీస్ పేపర్ 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.

English summary
Andhra Pradesh police SI recruitment preliminary exam hall tickets released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X