Prakasam జిల్లాలో ఉద్యోగాలు: సాగరమిత్ర పోస్టులకు అప్లయ్ చేయండి..అర్హతలు ఇవే..!
ప్రకాశం జిల్లాలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కోసం సాగర మిత్ర పోస్టుల భర్తీకి రాష్ట్ర మత్స్య శాఖ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసి సంబంధిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేరేందుకు చివరితేదీ 27 జనవరి 2021.
సంస్థ పేరు: ఏపీ మత్స్య శాఖ
పోస్టు పేరు: సాగరమిత్ర
పోస్టుల సంఖ్య: 65
జాబ్ లొకేషన్: ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 27 జనవరి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఫిషరీస్లో పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. షిషరీస్ సైన్స్, మెరైన్ బయలాజీ, జువాలజీల్లో ఒకటి ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: నవంబర్ 30 నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక ప్రక్రియ: మెరిట్ ప్రకారం 75శాతం, సాఫ్ట్ స్కిల్స్ 10శాతం, ఇంటర్వ్యూకి 15 శాతం వెయిటేజీ ఇస్తూ జిల్లా సెలెక్షన్ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
వేతనం: నెలకు రూ.15000/-