వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Jobs:కరెంటు ఆఫీసుల్లో ఎనర్జీ అసిస్టెంట్/ లైన్‌మ్యాన్ ఉద్యోగాలు..అర్హతలు ఇవే..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(ఏపీఈపీడీసీఎల్). పవర్ కంపెనీలో పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్న నిరుద్యోగుల కోసం ఎనర్జీ అసిస్టెంట్ మరియు లైన్‌ మ్యాన్ పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది ఏపీఈపీడీసీఎల్. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఎనర్జీ అసిస్టెంట్ మరియు జూనియర్ లైన్‌మ్యాన్ ఉద్యోగాలకు సంబంధించి 398 పోస్టులు భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులన్నీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఈ పోస్టులు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ కిందికి వస్తాయి. ఎనర్జీ అసిస్టెంట్ మరియు జూనియర్ లైన్ మ్యాన్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15వేలు చొప్పున రెండేళ్ల వరకు చెల్లించడం జరుగుతుంది. రెండేళ్ల తర్వాత వీరి సర్వీసును రెగ్యులర్ చేసి ఏపీఈపీడీసీఎల్ పేస్కేల్‌ను వర్తింపజేస్తారు.

APEPDCL Recruitment 2021:Apply for 398 Energy Assistant and Lineman jobs

ఎనర్జీ అసిస్టెంట్ మరియు జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టులకు సంబంధించి మొత్తం 398 పోస్టులను భర్తీ చేయనుంది. అయితే సర్కిళ్ల వారీగా ఏయే సర్కిల్స్‌లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో కూడా నోటిఫికేషన్‌లో పేర్కొంది. విజయనగరం సర్కిల్‌లో 74 పోస్టులు ఖాళీగా ఉండగా, విశాఖపట్నంలో 71 పోస్టులు, రాజమహేంద్రవరంలో 122 పోస్టులు ఏలూరు సర్కిల్‌లో 43 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఎనర్జీ అసిస్టెంట్/ జూనియర్ లైన్‌మ్యాన్‌ పోస్టులకు అర్హతలు ఇలా ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్ఎస్‌సీ లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్ ట్రేడ్‌/వైర్‌మ్యాన్ ట్రేడ్‌లలో ఐటీఐ చేసి ఉండాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు చేసి ఉండాలి. అదికూడా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్, రీవైండింగ్/ ఎలక్ట్రికల్ వైరింగ్ &కాంట్రాక్టింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ మరియు ఎలక్ట్రికల్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ మరియు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులు చేసి ఉండాలి.

ఏపీఈపీడీసీఎల్‌లో ఎనర్జీ అసిస్టెంట్/ జూనియర్ లైన్‌మ్యాన్‌ పోస్టుల ఎంపిక ప్రక్రియ ఇలా ఉంది. ముందుగా రాతపరీక్ష ఉంటుంది. ఐటీఐ సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది. మొత్తం 80 ప్రశ్నలకు గాను 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వడం జరుగుతుందని నోటిషికేషన్‌లో స్పష్టం చేయడం జరిగింది. అనంతరం అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు ఉంటాయి. ఇందులో పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్ మరియు సైక్లింగ్‌లు ఉంటాయి.

అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకైతే రూ.700 అదే ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు రూ.350.ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగష్టు 30వ తేదీన ప్రారంభమయ్యాయి.. ఇక దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పూర్తి చేసేందుకు చివరితేదీ 24 సెప్టెంబర్ 2021.మరెందుకు ఆలస్యం మంచి ఉద్యోగం మంచి జీతంను మిస్ కాకండి. అన్ని అర్హతలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తులను పూర్తి చేయండి: www.apeasternpower.com

English summary
Eastern Power Distribution Company of Andhra Pradesh Limited (APEPDCL) has released a notification to fill up 398 energy assistant and junior lineman jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X