వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో 9 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల: వివిధ శాఖల్లో 269 పోస్టుల భర్తీ, అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలనూ ప్రకటించింది. మొత్తం 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ తాజాగా ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. 72 ఆయుర్వేద వైద్యులు, 53 హోమియో వైద్యులు, 26 యునాని వైద్యులు, 34 హోమియో లెక్చరర్లు, మూడు ఆయుర్వేద లెక్చరర్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది.

11/2022 నోటిఫికేషన్ కింద ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ సబ్ సర్వీస్‌లో 12 శాంపిల్ టేకర్, 8 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, ఇతర పోస్టులు కలిపి మొత్తం 45 ఉన్నాయి.

 APPSC released 9 notifications to 269 posts in various departments.

23 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రెండు నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ జారీ చేసింది. 06/2022 నోటిఫికేషన్ కింద 06 పోస్టులను గ్రూప్-4 కేటగిరీలో భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ తెలిపారు.

ముఖ్యమైన తేదీలు:

గ్రూప్-4లో ఆరు పోస్టులు: ఈ పోస్టులకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నాన్ గెజిటెడ్ - 45 పోస్టులు: ఈ పోస్టులకు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆయుర్వేద లెక్చరర్లు 3 పోస్టులు: అక్టోబర్ 7 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

హోమియో లెక్చరర్లు 34 పోస్టులు: అక్టోబర్ 7 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ 72 పోస్టులు: అక్టోబర్ 6 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

హోమియో మెడికల్ ఆఫీసర్ 53 పోస్టులు: అక్టోబర్ 6 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

యునాని మెడికల్ ఆఫీసర్ 26 పోస్టులు: అక్టోబర్ 6 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏఈఈ- 23 పోస్టులు: అక్టోబర్ 6 నుంచి నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సివిల్ అసిస్టెంట్ సర్జన్ 7 పోస్టులు: అక్టోబర్ 27 నుంచి నవంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇది ఇలావుండగా, గ్రామ సచివాలయాల్లో 5160 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఇప్పటకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో త్వరలోనే మరో భారీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
APPSC released 9 notifications to 269 posts in various departments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X