
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పలు ఉద్యోగ నియామకాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నుంచి తాజాగా, మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పలు గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. పలు విభాగాల్లో మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.
ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, సెరీకల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ డైరెక్టర్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 08 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు డిసెంబర్ 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది.

ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్(AP Fisheries Service)- 11
సెరీకల్చర్ ఆఫీసర్ (AP Sericulture Service)- 01
అగ్రికల్చర్ ఆఫీసర్(AP Agriculture Service)- 06
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(AP Works Account Service)- 02
టెక్నికల్ అసిస్టెంట్(AP Police Service)- 01
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, - 03
అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్(AP Horticulture Service)-01
పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు:
ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్: పోస్టు కోసం అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు బ్యాచలర్ ఆఫ్ ఫిషరీష్ సైన్స్(బీ.ఎఫ్.సైన్స్) విద్యార్హతను గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి.
సెరీకల్చర్ ఆఫీసర్: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు అగ్రికల్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. బోటనీ/జువాలజీని సబ్జెక్టుగా కలిగి ఉండాలి.
అగ్రికల్చర్ ఆఫీసర్: అగ్రికల్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
టెక్నికల్ అసిస్టెంట్: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్: 'లా'లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, హైకోర్టు అడ్వకేట్‌గా మూడేళ్ల పాటు ప్రాక్టీస్ చేసి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా హిందువు అయి ఉండాలి.
అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్: అభ్యర్థులు నాలుగేళ్ల బీఎస్సీ(హార్టికల్చర్) డిగ్రీతో పాటు ఎమ్మెస్సీ హార్టికల్చర్ చేసి ఉండాలి.
వయో పరిమితి వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులకు 21-28 ఏళ్లు
అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులకు 28-42 ఏళ్లు, ఇతర పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18-42 ఏళ్లు ఉండాలి.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు పదేళ్లు, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు ఫీజు వివరాలు:
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 250, ఎగ్జామ్ ఫీజు కింద రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, వైట్ రేషన్ కార్డుదారులకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.
Recommended Video
ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు తోపాటు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ సంప్రదించవచ్చు.