వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

English Only: ఏపీపీఎస్సీ ఏఎంవీఐ నోటిఫికేషన్ సస్పెండ్ చేసిన హైకోర్టు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చేపట్టని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ) నోటిఫికేషన్ ను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాశీ ప్రసన్నకుమార్.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.

సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ప్రశ్నాపత్రం కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుందని ఇవ్వడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.

APPSCs AMVI notification suspended by High Court

ప్రశ్నాపత్రం ఇంగ్లీష్‌లో మాత్రమే ఇవ్వడం రాజ్యాంగ సూత్రాలకి, న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని చెప్పారు. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

గురుకులాల్లో 1010 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో శుభవార్త అందించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 1010 పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

నవంబర్ 18న గురుకులాలు, వసతి గృహాలు, అంగన్ వాడీ కేంద్రాల్లో నాడు-నేడు పనులపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఈ మేరకు ఆదేశించారు. వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 759 సంక్షేమాధికారి పోస్టులు, 80 కేర్ టేకర్ పోస్టులు, గిరిజన గురుకులాల్లోని 171 వసతి గృహ అధికారులను నియమించాలని స్పష్టం చేశారు. పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నియామకంపైనా దృష్టి పెట్టాలని చెప్పారు.

English summary
APPSC's AMVI notification suspended by High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X