• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

BEL Recruitment: ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Project Engineer), ట్రైనీ ఇంజనీర్‌ (Trainee Engineer) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తు ఆహ్వానించింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు తెలుసుకోండి.

బెల్ రిక్రూట్‌మెంట్ 2022 వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 20

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులు

 BEL Recruitment 2022: Apply for 20 Project Engineer, Trainee Engineer Posts.

ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: 12
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్

వయోపరిమితి: అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లకు మించరాదు.

అర్హతలు:
సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 2 ఏళ్లాపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

పే స్కేల్‌:
మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో ఏడాది నెలకు రూ.45,000, మూడో ఏడాది నెలకు రూ.50,000 నాలుగో ఏడాది రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ట్రైనీ ఇంజనీర్‌: 12
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌

వయో పరిమితి:
అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్లకు మించరాదు.

అర్హతలు:
సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పే స్కేల్‌:
మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.35,000, మూడో ఏడాది నెలకు రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌/ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా:
Sr. Dy. General Manager (HR&A), Bharat Electronics Limited, N.D.A.Road, Pashan, Pune- ted, N.D.A.Road, Pashan, Pune411021 Maharashtra.కు దరఖాస్తు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 16, 2022

బెల్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(https://www.bel-india.in/CareersGridbind.aspx?MId=29&LId=1&subject=1&link=0&issnno=1&name=Recruitment+-+Advertisements)

English summary
BEL Recruitment 2022: Apply for 20 Project Engineer, Trainee Engineer Posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X