వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

BHEL Recruitment: రూ.70వేల వరకు జీతం, ఇంజినీర్, ఇతర పోస్టులకు అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(BHEL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భెల్ సివిల్ విభాగంలో అనుభవజ్ఞులైన ఇంజనీర్లు, సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఎంపిక చేయబడే అభ్యర్థులు భారతదేశంలోని వారి ప్రాజెక్ట్ సైట్‌లలో ఫిక్స్‌డ్ టెన్యూర్ అపాయింట్‌మెంట్ ప్రాతిపదికన పూర్తిగా నిమగ్నమై ఉంటారని గమనించాలి.

ఆసక్తి ,అర్హత ఉన్న అభ్యర్థులు భెల్ - pswr.bhel.com అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 11, 2022న లేదా అంతకు ముందు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 BHEL Recruitment 2022: Apply for Engineer, Supervisor posts

BHEL రిక్రూట్‌మెంట్ 2022: ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల ఆన్‌లైన్ సమర్పణ డిసెంబర్ 28, 2021న ప్రారంభమైంది

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ జనవరి 11, 2022న ముగుస్తుంది

BHEL - PSWR, నాగ్‌పూర్‌లో దరఖాస్తు ఫారమ్ ప్రింట్-అవుట్‌ను పంపడానికి చివరి తేదీ - జనవరి 14, 2022

BHEL రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీల వివరాలు
ఇంజనీర్ -10
సూపర్‌వైజర్ -26

BHEL రిక్రూట్‌మెంట్ 2022: జీతం వివరాలు

ఇంజనీర్లు - రూ 71,040/- నెలకు

సూపర్‌వైజర్ -రూ. 39,670/- నెలకు

BHEL రిక్రూట్‌మెంట్ 2022: ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులు విద్యార్హత, రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఇతర వివరాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు- వివరణాత్మక నోటిఫికేషన్
(https://careers.bhel.in/bhel/jsp/)

BHEL రిక్రూట్‌మెంట్ 2022: వయో పరిమితి

అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి (1/1/2022 నాటికి).

BHEL రిక్రూట్‌మెంట్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి

దరఖాస్తుల సమర్పణ అధికారిక వెబ్‌సైట్ https://pswr.bhel.com లేదా https://careers.bhel.inలో ఆన్‌లైన్‌లో ఉంటుంది.

అదనంగా, అభ్యర్థులు వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసిన పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను డిమాండ్ డ్రాఫ్ట్ లేదా క్యూఆర్ కోడ్‌తో పాటు పంపాలి. చిరునామా:
"Sr. Deputy General Manager (HR) BHEL, Power Sector Western Region, Shree Mohini Complex, 345 Kingsway, Nagpur - 440001".

English summary
BHEL Recruitment 2022: Apply for Engineer, Supervisor posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X