బీఎస్ఎఫ్లో 431 గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 431 గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 మార్చి 2020.
సంస్థ పేరు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
పోస్టు పేరు: గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులు
పోస్టుల సంఖ్య: 431
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 మార్చి 2020
విద్యార్హతలు: 10వ తరగతి, ఇంటర్మీడియెట్ మరియు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: కానిస్టేబుల్ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్లు ఉండాల్సి ఉండగా... ఎస్ఐ పోస్టులకు 22 నుంచి 28 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: ఎస్ఐ పోస్టుకు రూ. 200/-
హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టులకు రూ. 100/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16-03-2020