వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1.4 లక్షల కొలువులకు డిసెంబర్ 15వ తేదీ నుంచి పరీక్ష: రైల్వేమంత్రి పీయూష్ గోయల్

|
Google Oneindia TeluguNews

రైల్వేలో 1.4 లక్షల ఉద్యోగాల కోసం పరీక్షను డిసెంబర్ 15వ తేదీ నుంచి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ (ఎన్టీపీసీ)లో లెవల్-1 విభాగంలో కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం ట్వీట్ చేశారు.

నోటిఫికేషన్ ప్రకారం లక్ష 40 వే 640 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ఈ పోస్టుల కోసం 2 కోట్ల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ వల్ల పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి మూడు క్యాటగిరీల్లో పరీక్షలు నిర్వహిస్తామని.. పూర్తి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

CBT for 1.4 lakh vacancies from Dec 15, full schedule soon..

లెవల్ 1లో లక్ష కొలువులు ఉండగా.. 35 వేల 277 పోస్టులు ఎన్టీపీసీ విభాగంలో ఉన్నాయి. పారా మెడికల్ సిబ్బంబి ఉన్నారు. మిగతా కొలువులు నాన్ టెక్నికల్ పాపులర్ విభాగంలో ఉన్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పరీక్ష పూర్తి చేయాల్సి ఉన్న కరోనా వైరస్ వల్ల.. అదీ డిసెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

English summary
RRB NTPC Recruitment 2019: The Railway Recruitment Board will conduct Computer based Tests for recruitment in non-technical popular categories
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X