హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డెలాయిట్‌ రిక్రూట్‌మెంట్: వెంటనే అప్లై చేయండి, మంచి కెరీర్ ప్రారంభించండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఐటీ సంస్థలు మళ్లీ ఉద్యోగ నియామకాలను ప్రారంభించాయి. ఇప్పటికే ఐటీ దిగ్గజం టీసీఎస్ భారీ సంఖ్యలో నియామకాలను చేపడుతుండగా.. తాజాగా, గ్లోబల్ అకౌంటింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ కూడా ఫ్రెషర్స్‌ను భారీగా రిక్రూట్ చేసుకుంటోంది.

కొత్త నియామకాల కోసం క్యాంపస్ కనెక్ట్ పేరుతో కొత్త ప్రోగ్రాంను ప్రారంభించినట్లు డెలాయిట్ సంస్థ తెలిపింది. ఈ కొత్త ప్రోగ్రాం ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని క్యాంపస్‌లలో నియామకాలను చేపడుతున్నామని డెలాయిట్ పేర్కొంది. ప్రతిభావంతులైన యువతను నియమించుకుని తమ ఐటీ సేవలను మరింతగా విస్తరిస్తామని తెలిపింది.

Deloitte Recruitment 2021: Fresh Graduates Can Apply, Details here

కాగా, హైదరాబాద్ లొకేషన్‌లో క్వాలిటీ అనలిస్ట్ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు డెలాయిట్ వెల్లడించింది. బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/బీసీఏ పూర్తి చేసిన ఫ్రెషర్లు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

క్వాలిటీ అనలిస్ట్​ ఉద్యోగానికి కావాల్సిన​ అర్హతలు, నైపుణ్యాలు

ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీ సర్వీస్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన ఉండాలి. టెస్టింగ్ అప్‌గ్రేడ్‌లు, ప్యాచ్‌లపై అవగాహన ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ తోపాటు డాట్‌నెట్, జావా స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, ఎస్‌క్యూఎల్, ఎక్స్‌ఎంఎల్, ఎస్ఓఏపీ, టీఎఫ్ఎస్ వంటి సాఫ్ట్‌వేర్లు, వెబ్ టెక్నాలజీపై అవగాహన ఉండి ఉండాలి. టీ-ఎస్‌క్యూఎల్, స్టోరేజ్ ప్రొసీజర్స్ పై పనిచేసిన అనుభవం లేదా పరిజ్ఞానం ఉండాలి.

టెస్ట్ డైరెక్టర్, క్వాలిటీ సెంటర్ అండ్ మైక్రో సాఫ్ట్ టెస్ట్ మేనేజర్ వంటి మెర్కూరీ టెస్ట్ మేనేజ్‌మెంట్ టూల్స్‌లో అనుభం ఉండాలి. ఇక యూఎఫ్‌టీ(క్యూటీపీ) లేదా కోడెడ్ యూఐ లేదా సెలీనియం వంటి టెస్టింగ్ టూల్స్‌పై అవగాహన ఉండాలి. ఎంటర్‌ప్రైజ్ వైడ్ నెట్‌వర్క్స్, సాఫ్ట్‌వేర్ ఇంప్లిమెంటేషన్స్‌పై పరిజ్ఞానం ఉంటే మంచిది.

క్వాలిటీ అనలిస్టుగా టీమ్ డెవలప్‌మెంట్ , టెక్నికల్ డెలివరీ మ్యాంగర్స్, ప్రొడక్ట్ ఓనర్స్, యూఎస్ స్టూడియో టీంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.

క్లయింట్లకు అవసరమైన టెస్టింగ్ సర్వీసులను కన్సిప్టెన్సీ, క్వాలిటీ, ఎఫీషియన్సీతో అందించాల్సి ఉంటుంది. క్వాలిటీ టెస్టింగ్ కోసం అవసరమైన అన్ని ఫంక్షన్లను విశ్లేషించాలి. దీంతోపాటు టెస్టింగ్ యాక్టివిటీస్‌ను ప్లానింగ్, డెవలప్, కో-ఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. టెస్టింగ్ ప్లాన్, టెస్ట్ సినారియో, టెస్ట్ కేసెస్‌ను ప్రిపేర్ చేయడం, టెస్టింగ్ ఎగ్జిక్యూషన్, టెస్టింగ్ అనాలసిస్ వంటి బాధ్యతలు, విధులు ఈ ఉద్యోగాల్లో చేరి అభ్యర్థులపై ఉంటాయి. https://usijobs.deloitte.com/ సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

English summary
Deloitte Recruitment 2021: Fresh Graduates Can Apply, Details here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X