DMHOలో ఉద్యోగాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్ అకౌంటెంట్ జాబ్స్‌కు అప్లయ్ చేయండి
రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం కింద డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు అకౌంటెంట్స్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 28వ తేదీ జనవరి 2021లోగ తమ అప్లికేషన్లను పోస్టు ద్వారా రంగారెడ్డి డీఎంహెచ్ఓ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: డీఎంహెచ్ఓ, రంగారెడ్డి
పోస్టు పేరు: డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్స్
పోస్టుల సంఖ్య:23
జాబ్ లొకేషన్: రంగారెడ్డి తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: 28 జనవరి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు రెండేళ్లు అనుభవం
వయస్సు: 18 ఏళ్ల నుంచి 34 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులు కేటాయించగా 90 మార్కులు రాత పరీక్షకు మిగతా 10 మార్కులు వయస్సుకు కేటాయించడం జరిగింది.
అప్లికేషన్ ఫీజు: రూ.100/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28 జనవరి 2021
పూర్తి చేసిన దరఖాస్తుకు సంబంధిత ధృవ పత్రాలను జతచేసి ఈ కింది చిరునామాకు పోస్టు ద్వారా మాత్రమే పంపాలి
డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ (డీహెచ్ఎంఓ)
రంగారెడ్డి జిల్లా, పిల్లర్ నెం 294 వద్ద, శివరాంపల్లి,
రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా -500052