ECGCలో ఉద్యోగాలు: డిగ్రీ పాసైతే ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి
ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 59 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 31 జనవరి 2021 కల్లా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 59
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 జనవరి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 21 నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ. 32795-1610(14)-55335-1745(4)-62315
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.125/-
ఇతరులకు: రూ. 700/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 జనవరి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 జనవరి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.ecgc.in/english/career-with-ecgc/