వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ECILలో టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!!

|
Google Oneindia TeluguNews

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిసియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికనే ఉంటుంది. మంచి వేతనం కూడా అందిస్తోంది సంస్థ.

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలో భాగంగా టెక్నికల్ ఆఫీసర్,సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిసియన్ పోస్టులను భర్తీ చేయనుంది. వివిధ కేటగిరీల్లో పోస్టుల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ-1లో 4 పోస్టులు ఉండగా టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ-2లో ఒక పోస్టు,టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ-3లో ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. ఇక సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ- 1లో మూడు పోస్టులు ఉండగా, సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ-2లో మూడు పోస్టులు,సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ-3లో రెండు పోస్టులు ఉన్నాయి. ఇక జూనియర్ ఆర్టిసియన్ పోస్టులు ఏడు ఉన్నాయి.

ECIL Recruitment 2021:Apply for Technical and Scientific assistant posts

ఇక విద్యార్హతల విషయానికొస్తే టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ-1కు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్‌ విభాగంలో బీఈ/ బీటెక్ ఉండాలి. ఇక టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ -2 ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ విభాగంలో బీఈ/బీటెక్ చేసి ఉండాలి. టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీ-3 కంప్యూటర్ సైన్స్ మరియు ఐటీలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ-1,2,3లకు ఫుల్ టైమ్ డిప్లొమా ఉండాలి. జూనియర్ ఆర్టిసియన్‌కు ఆయా ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

టెక్నికల్ ఆఫీసర్‌ పోస్టుకు అప్లయ్ చేసే అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి.సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు 25 ఏళ్లు, జూనియర్ ఆర్టిసియన్ పోస్టుకు 25 ఏళ్లు ఉండాలి. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు జూనియర్ ఆర్టిసియన్ పోస్టులకు రాత పరీక్ష ట్రేడ్ టెస్టు ఉంటుంది. ఈ పోస్టులన్నీ పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన ఉంటాయి. ఇక ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. వాకిన్ ఇంటర్వ్యూలు 28 ఆగష్టు 2021 నుంచి 9 సెప్టెంబర్ 2021 వరకు జరుగుతాయి. వేతనం వివరాలు ఇలా ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్‌కు నెలకు రూ.23వేలు, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు రూ. 20,384/- జూనియర్ ఆర్టిసియన్‌కు నెలకు రూ. 18,564 ఉంటాయి.

ఇక ఇంటర్వ్యూ జరిగే ప్రాంతాలు ముంబై మరియు తారాపూర్, కైగా, కూడంకుళం, కోటా, నరోరా. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు http://ecil.co.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

English summary
ECIL has issued notification to fill Technical officers, scientific assistants and junior artisian posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X