వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరుద్యోగులకు శుభవార్త: త్వరలోనే తెలంగాణాలో 13వేల టీచర్ పోస్టుల భర్తీ

|
Google Oneindia TeluguNews

నిరుద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న జాబ్ నోటిఫికేషన్ల నిర్ణయంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఇక ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు? దానికి కావలసిన విద్యార్హతలేమిటి? చదవలసిన సబ్జెక్టులు ఏమిటి అన్న దానిపై క్రమంగా క్లారిటీ వస్తుంది. జాబ్ నోటిఫికేషన్ ల కోసం తెలంగాణా ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేస్తుంటే,ఇక నిరుద్యోగ యువత పుస్తకాలతో కుస్తీ మొదలుపెట్టారు.

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి హరీష్ రావు

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి హరీష్ రావు

తాజాగా మరోమారు తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 13 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నామని వెల్లడించింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రెండు రోజుల క్రితం వారంలోనే పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది, సిద్ధంగా ఉండమని చెప్పిన హరీష్ రావు ఇప్పుడు మళ్లీ త్వరలో టీచర్ల పోస్టుల భర్తీ చేస్తామని శుభవార్త చెప్పారు. దీంతో టీచర్ పోస్టుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఊపిరి వచ్చినట్టయ్యింది.

రాష్ట్రంలో 13వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్న హరీష్ రావు

రాష్ట్రంలో 13వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్న హరీష్ రావు

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి హరీష్ రావు విద్యా, ఉద్యోగాల్లో కాంట్రాక్టులలో రిజర్వేషన్ తీసుకువచ్చామని వెల్లడించారు. పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడం కోసం ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించడం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో 13 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హరీష్ రావు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ బోధన జరిగేలా చర్యలు చేపట్టామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

గతంలో కెసీఆర్ కూడా టీచర్ పోస్టులపై ఆసక్తికర ప్రకటన

గతంలో కెసీఆర్ కూడా టీచర్ పోస్టులపై ఆసక్తికర ప్రకటన

గతంలో సీఎం కేసీఆర్ కూడా అవసరమనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరో 10 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రతి పాఠశాలలోనూ అన్ని సబ్జెక్టుల టీచర్స్ ఉండాలన్నది తమ ఉద్దేశమని ప్రకటించిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పాటించటానికి పెద్దపీట వేస్తామని వెల్లడించారు. తెలంగాణలో టీచర్ పోస్టుల కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న ఎంతో మంది నిరుద్యోగులకు తాజాగా మంత్రి హరీష్ రావు చేసిన ప్రకటన సంతోషాన్నిచ్చింది.

ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫై చేశామని మంత్రి హరీష్ రావు వెల్లడి

ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫై చేశామని మంత్రి హరీష్ రావు వెల్లడి

తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతుందని, ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫై చేశామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ జరగనున్న నేపథ్యంలో శ్రద్ధగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. తెలంగాణాలో జాబ్ నోటిఫికేషన్లు రానున్న నేపధ్యంలో ఎక్కువ మంది గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్, టీచర్ ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం కనిపిస్తుంది.

English summary
The government has good news for the unemployed in Telangana. Minister Harish Rao has revealed that 13,000 teacher posts will be filled in Telangana soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X