వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

APPSC Jobs : త్వరలో 1180 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1180 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కసరత్తులు పూర్తి చేసింది. మరో వారం లేదా పది రోజుల్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్ కేటగిరీకి చెందిన అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితి పొడగింపుకు కమిషన్ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది.

అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా కింద 10 శాతం రిజర్వేషన్ అమలుకానుంది. అయితే ఈ కోటాలో భర్తీ కాని పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయాలా వద్దా అనే దానిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతూ ఇప్పటికే ఏపీపీఎస్సీ కమిషన్ లేఖ రాసింది. దీంతో పాటు రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

 govt job notifications appsc will soon issue notifications for 1180 jobs

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్న పోస్టులు :

మెడికల్ ఆఫీసర్(ఆయుర్వేద)-72
మెడికల్ ఆఫీసర్(యునాని)-26
మెడికల్ ఆఫీసర్(హోమియోపతి)-53
లెక్చరర్(హోమియో)-24
లెక్చరర్(డాక్టర్ ఎన్ఆర్ఎస్‌జీఏసీ ఆయుష్)-3
జూ.అసిస్టెంట్,కంప్యూటర్ అసిస్టెంట్ 670
అసిస్టెంట్ ఇంజనీర్లు-190
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్-3(ఎండోమెంట్)
హార్టికల్చర్ ఆఫీసర్-39
తెలుగు రిపోర్టర్(లెజిస్లేచర్)-5
డిస్ట్రిక్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్-4
ఇంగ్లీష్ రిపోర్టర్(లెజిస్లేచర్)-10
జూనియర్ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ-10
డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ-5
అసిస్టెంట్ కన్జర్వేటర్,ఫారెస్ట్ సర్వీస్-9

రాష్ట్రంలో వివిధ విభాగాల్లో మొత్తం 1,180 పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం ఇప్పటికే జీవో 49 విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే నోటిఫికేషన్లు ఉంటాయని కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి.

English summary
Notifications for jobs in various government departments in Andhra Pradesh will be issued soon. To this end, the Andhra Pradesh Public Service Commission has completed the exercises. Notifications are likely to issue in another week or ten days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X