వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రూప్-1 నోటిఫికేషన్: మొత్తం 503పోస్టులలో శాఖల వారీగా ఖాళీల వివరాలివే!!

|
Google Oneindia TeluguNews

గ్రూప్-1 పోస్టుల నోటిఫికేషన్ కోసం సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-I కేడర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చెయ్యటానికి సర్వం సిద్ధం అయ్యింది. శనివారం సమావేశమైన తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.

19 వివిధ విభాగాల్లో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి రెడీ .. వివరాలివే

19 వివిధ విభాగాల్లో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి రెడీ .. వివరాలివే

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 19 వివిధ విభాగాల్లో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. ఇక ఆ వివరాలను చూస్తే 121 మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు, 91 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, 42 డిప్యూటీ కలెక్టర్లు, 40 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లు 20 పోస్టులు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు 38 పోస్టులు, డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ 5 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు, వీటికి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఆర్ధిక శాఖ పేర్కొంది.

శాఖల వారీగా ఖాళీలు ప్రకటించిన ఆర్ధిక శాఖ

శాఖల వారీగా ఖాళీలు ప్రకటించిన ఆర్ధిక శాఖ

అంతేకాదు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ 2 ఖాళీలు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8 ఖాళీలు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 2 ఖాళీలు, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ 6 ఖాళీలు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 35 ఖాళీలు, డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఆఫీసర్ 5 ఖాళీలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26 ఖాళీలు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 5 ఖాళీలు, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ౩ ఖాళీలు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 4 ఖాళీలు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2 ఖాళీలు ఉన్నట్టు సమాచారం

తెలంగాణా ఏర్పాటు తర్వాత మొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్

తెలంగాణా ఏర్పాటు తర్వాత మొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే తొలి గ్రూప్-1 నోటిఫికేషన్. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 2011లో ఇటువంటి నోటిఫికేషన్ జారీ చేయబడింది. అయితే, న్యాయపరమైన చిక్కుల కారణంగా రిక్రూట్‌మెంట్ 2017లో పూర్తయింది. ఇప్పుడు మళ్లీ గ్రూపు నోటిఫికేషన్ ను జారీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మరింత పారదర్శకంగా మరియు పక్షపాత రహిత ఎంపిక ప్రక్రియను నిర్ధారించడానికి, రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-I మరియు గ్రూప్-II పోస్టులతో సహా అన్ని కేటగిరీల క్రింద టి ఎస్ పి ఎస్ సి పరీక్షల కోసం ఇంటర్వ్యూలను రద్దు చేసింది.

పెద్ద ఎత్తున గ్రూప్ 1 పోస్టులకు పోటీ పడనున్న నిరుద్యోగ యువత

పెద్ద ఎత్తున గ్రూప్ 1 పోస్టులకు పోటీ పడనున్న నిరుద్యోగ యువత

ఇంతకుముందు, గ్రూప్-1 పోస్టులకు రిక్రూట్‌మెంట్ అనేది ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్ష మరియు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)తో కూడిన మూడు-దశల ప్రక్రియ. కానీ ఇప్పుడు ఆ విధానంలో ఇంటర్వ్యూలు రద్దు చేసి పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రూప్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో ఈసారి పెద్ద ఎత్తున గ్రూప్ 1 ఉద్యోగాల కోసం అభ్యర్థులు పోటీ పడనున్నారు.

English summary
The Telangana government has already sanctioned to fill 503 Group-1 posts in 19 departments. Finance dept Announced details of vacancies by departments in a total of 503 posts. everything is ready to give Group 1 notification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X