వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IBPS RRB PO Exam 2020: ఈ కటాఫ్ మార్కులు ఎంత.. పరీక్షపై నిపుణుల విశ్లేషణ ఏంటి..?

|
Google Oneindia TeluguNews

ఏటా కొన్ని వేల సంఖ్యలో బ్యాంకుల్లో నియామకాలు జరుగుతున్నాయి. ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. ఇక తాజాగా అంటే సెప్టెంబర్ 12వ తేదీ మరియు సెప్టెంబర్ 13వ తేదీ ఐబీపీఎస్ రీజియనల్ రూరల్ బ్యాంక్ పీఓ పరీక్షను నిర్వహించింది. మొత్తం ఐదు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించడం జరిగింది. అయితే అభ్యర్థుల్లో మాత్రం ఈ పరీక్ష కటాఫ్ మార్కులు ఎంతుంటాయనే చర్చ జరుగుతోంది.

ప్రిలిమ్స్‌లో 80 ప్రశ్నలకు 45 నిమిషాలు

ప్రిలిమ్స్‌లో 80 ప్రశ్నలకు 45 నిమిషాలు

ఐబీపీఎస్ పరీక్షా కేంద్రాల వద్ద అన్ని కోవిడ్ జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అధికారులు . ఇక పరీక్ష సందర్భంగా అభ్యర్థులకు ముందుగానే రెండు వైట్ పేపర్స్‌ను అందజేశారు అభ్యర్థులు. ఇక పరీక్షా విషయానికొస్తే పేపర్ కాస్త కష్టంగానే అనిపించిందని అభ్యర్థులు చెబుతున్నారు. నిపుణులు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఇక పరీక్ష జరిగిన తీరు, కొశ్చన్ పేపర్ పై పూర్తి అనాలిసిస్ మీకోసం.సెప్టెంబర్ 12న జరిగిన ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ప్రిలిమ్స్ పరీక్షలో భాగంగా మొత్తం 45 నిమిషాల్లో అభ్యర్థులు 80 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఈ సారి పేపర్లో రీజనింగ్ పై అడిగిన ప్రశ్నలు చాలా ట్రిక్కీగా అనిపించాయి. ఇన్‌ఈక్వాలటీ టాపిక్ పై ఐదు ప్రశ్నలు అడగడం జరిగింది. అదే సమయంలో పెయిరింగ్ టాపిక్‌పై కూడా ప్రశ్నలు అడిగినట్లు అభ్యర్థులు చెబుతున్నారు.

సిలాజిసమ్ పై కనిపించని ప్రశ్నలు

సిలాజిసమ్ పై కనిపించని ప్రశ్నలు

ఇక ఎప్పుడూ సిలాజిసమ్ పై ప్రశ్నలు కనిపించేవి కానీ ఈ సారి మాత్రం ఒక్క ప్రశ్న కూడా అడగకపోవడంతో అభ్యర్థులు ఆశ్చర్యానికి గురయ్యారు.ఇక దిక్కులు, చైనీస్ కోడింగ్, ఇన్‌ఈక్వాలిటీ పై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సమయం ఎక్కువగా తీసుకుందని అభ్యర్థులు చెప్పారు. ఈ సారి కొశ్చన్ పేపర్‌లో ప్రశ్నలు రెండు భాషల్లో ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. ఇక క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పై ప్రశ్నలు ఊహించిన దానికంటే ఎక్కువగా అడిగినట్లు అభ్యర్థులు చెప్పారు. ఇందులో భాగంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ పై ప్రశ్నలు బాగా వచ్చినట్లు అభ్యర్థులు చెప్పారు. దీంతో ఆప్టిట్యూడ్ టాపిక్ పై అడిగిన ప్రశ్నలు చాలా కష్టంగా అనిపించాయని అభ్యర్థులు చెప్పారు. ఇక గతేడాది అడిగిన ప్రశ్నలతో పోలిస్తే ఈ ఏడాది చాలా కష్టంగా ప్రశ్నలు ఉన్నాయని అయితే కటాఫ్ మార్కులు తక్కువగానే బోర్డు నిర్ణయింస్తుందని భావిస్తున్నట్లు అభ్యర్థులు చెప్పారు.

నిపుణుల విశ్లేషణ

నిపుణుల విశ్లేషణ

ఇక పరీక్షలో అడిగిన కొశ్చన్స్‌ను పరిశీలించిన నిపుణులు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రశ్నలు చాలా పెద్దవిగా ఇచ్చి అభ్యర్థుల టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ను పరీక్షించారని చెబుతున్నారు. చాలావరకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని అయితే కాస్త ట్రిక్కీగా కూడా ఉన్నట్లు వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రీజనింగ్ పై అడిగిన ప్రశ్నలను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సీటింగ్ టాపిక్ పై అడిగిన ప్రశ్నలు కూడా కష్టతరంగా ఉన్నాయని నిపుణులు చెప్పారు.

Recommended Video

JEE-Main Exam 2020 Guidelines: Candidates Must Follow Rules JEE-Main Exam 2020 Guidelines
కటాఫ్ మార్కులపై నిపుణుల అంచనా

కటాఫ్ మార్కులపై నిపుణుల అంచనా

ఇక చివరిగా కటాఫ్ మార్కులు విషయానికొస్తే... గతేడాది ఆయా రాష్ట్రాల వారీగా 40 నుంచి 65 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు. అస్సాంలో 41.5 మార్కులు ఉండగా ఉత్తరాఖండ్‌లో 65 మార్కులు కటాఫ్‌ను విధించడం జరిగింది. ఈ ఏడాది జరిగిన పరీక్షలో అభ్యర్థులు దాదాపు 60 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం 52 నుంచి 57 ప్రశ్నలకు కరెక్టుగా సమాధానం ఇచ్చిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని చెబుతున్నారు. మెయిన్స్‌ పరీక్షకు క్వాలిఫై కావాలంటే అభ్యర్థి కనీసం 35 ప్రశ్నలను అంటెప్ట్ చేసి కరెక్ట్‌ సమాధానం ఇచ్చి ఉండాలని చెబుతున్నారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ టాపిక్‌లో 22 నుంచి 27 ప్రశ్నలు, రీజనింగ్‌లో 28 నుంచి 31 ప్రశ్నలు కనుక సరిగ్గా సమాధానాలు ఇచ్చి ఉంటే మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

English summary
Institute of Banking Personnel Selection is conducting the IBPS RRB PO Prelims 2020 exam on September 12 and 13, 2020 in 5 shifts across the country and the expected cut off marks have been told by experts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X