వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐబీపీఎస్ నుంచి టీసీఎస్ వరకు ఉద్యోగావకాశాలు: ఈ వారంలోనే అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ వారంలో దరఖాస్తు చేసుకునే ఉద్యోగావకాశాల గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఐబీపీఎస్ నుంచి టీసీఎస్ వరకు పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పటికే విడుదలయ్యాయి. వాటి వివరాలు..

ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

ఇండియన్ నేవీ మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్) కింద 300 నావికుల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే దాని అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.inలో అక్టోబర్ 29 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 2. దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల విద్యా మండలి నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ శిక్షణ కాలంలో నెలకు రూ. 14,600 స్టైపెండ్ లభిస్తుంది. ఆ తర్వాత, వారికి రూ. 21,700 నుంచి రూ. 69,100 మధ్య చెల్లించబడుతుంది.

టీసీఎస్‌లో ఉద్యోగాలు

టీసీఎస్‌లో ఉద్యోగాలు

ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 2020 లేదా 2021 సంవత్సరంలో బీఈ, బీటెక్, ఎఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ డిగ్రీలు పూర్తి చేసిన తగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం కంపెనీ వెతుకుతోంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి చివరి తేదీ నవంబర్ 15. ఉద్యోగానికి ఎంపిక కావడానికి అభ్యర్థులు వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూను క్లియర్ చేయాల్సి ఉంటుంది.

దక్షిణ మధ్య రైల్వేలో 4వేల ఉద్యోగాలు

దక్షిణ మధ్య రైల్వేలో 4వేల ఉద్యోగాలు

దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆధ్వర్యంలోని భారతీయ రైల్వేలు కూడా 4,103 అప్రెంటీస్‌ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు scr.indianrailways.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ నవంబర్ 3 వరకు అందుబాటులో ఉంటుంది. వ్రాత పరీక్ష లేదా వైవా ఉండనప్పటికీ, ఎంపికైన దరఖాస్తుదారులు వైద్య పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.

డీఆర్డీవోలో ఉద్యోగాలు

డీఆర్డీవోలో ఉద్యోగాలు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) కోసం గ్రాడ్యుయేట్లు, టెక్నీషియన్‌లు (డిప్లొమా), ట్రేడ్ అప్రెంటీస్‌ల రిక్రూట్‌మెంట్ కోసం ఓపెనింగ్స్‌ను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు DRDO అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 15 వరకు కొనసాగుతుంది. డిప్లొమా అప్రెంటీస్‌లుగా ఎంపికయ్యే అభ్యర్థులకు నెలవారీ రూ. 8000 స్టైఫండ్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లకు నెలకు రూ.9000 చెల్లిస్తారు.

ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు

ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల కోసం పలు బ్యాంకుల్లో మొత్తం 4,135 ఖాళీల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, ibps.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదు చేసుకోవడానికి నవంబర్ 10 చివరి తేదీ.

ఫీజు చెల్లింపు ,దరఖాస్తు ఫారమ్‌ల దిద్దుబాటు ఒకే సమయంలో చేయాలి.

ఐవోసీఎల్‌లో ఉద్యోగాలు

ఐవోసీఎల్‌లో ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) గౌహతి, బరౌని, గుజరాత్, హల్దియా, మథుర, PRPC, పానిపట్ దిగ్‌బోయి, బొంగైగావ్, పారాదీప్‌లోని రిఫైనరీలలో 1,968 మంది ట్రేడ్ అప్రెంటీస్‌లు, టెక్నీషియన్‌ల కోసం రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్లికేషన్ విండో అక్టోబర్ 22 నుంచి ప్రారంభమైంది. నవంబర్ 12 వరకు తెరిచి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక పోర్టల్ - iocl.comలో దరఖాస్తు చేసుకోవచ్చు.

English summary
IBPS-TCS: List of Top Jobs to Apply in This Week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X