వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు జాబ్ కోల్పోయారా..? ఈ రంగాల్లో అయితే ఉద్యోగాలు ఫుల్, బీపీవో, హెల్త్ కేర్.. కానీ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల అన్నీ సంస్థలు/పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గుతోంది. ఎంఎన్‌సీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. దీంతో కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మ్యాన్ పవర్ తగ్గించుకొనే ప్రయత్నంలో భాగంగా.. జీతాల కోత, ఉద్యోగాల తొలగింపు లాంటి ప్రక్రియ చేపడుతోంది. అయితే కొన్ని సంస్థల్లో ఉద్యోగాలకు మాత్రం కొదవ లేదు. ఆ రంగాలు ఏంటో చుద్దాం పదండి.

వికాశ్ శర్మ అనే వ్యక్తి లాక్ డౌన్ వల్ల తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మూసివేశారు. కానీ ఇల్లు గడవాలి కదా.. అందుకోసం కోలస్ట్రాల్ ఫ్రెండ్లీ బిస్కట్లను విక్రయించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఘజియాబాద్ వద్ద బిస్కెట్లు అమ్ముతూ నెలకు రూ.20 వేలు సంపాదించాడు. లాక్ డౌన్ సమయంలో ఆయనకు అదే తిండిపెట్టింది. లాక్ డౌన్ 2 నెలలు ఖాళీగా ఉన్నానని.. తర్వాత బిస్కెట్లు తయారుచేసి విక్రయించానని తెలిపారు.

In a season of layoffs, here’s where jobs can be found..

పుణెకి చెందిన ఐశ్వర్య బీపీవో కంపెనీలో పనిచేసేవారు. అయితే లాక్ డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయారు. కానీ జూన్‌లో మరో ఆఫర్ వచ్చింది.. కానీ గత జాబ్ రూ.31 వేల జీతం అయితే.. కొత్త ఉద్యోగం నైట్ షిప్టులో 17 వేలు ఇచ్చేవారు అని పేర్కొన్నది. ఒకవేళ డే షిప్టులో జాబ్ కావాలంటే రూ.13 వేల జీతం ఇచ్చేవారు అని తెలిపారు. తక్కువ వేతనానికి బీపీవోలో ఉద్యోగాలకు కొదవలేదని చెప్పారు.

తక్కువ నాణ్యత గల ఉద్యోగాలను అద్దె ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆన్ లైన్ విద్యకు సంబంధించి హోం హెల్త్ కేర్ జాబ్స్ కూడా ఉన్నాయి. సాప్ట్ వేర్, హార్డ్ వేర్ కన్నా ఈ రంగాల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఐటీ జాబ్స్ మొత్తం ఇంటి నుంచే చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని బట్టి బీపీవో, హెల్త్ కేర్, ఫిన్ టెక్, డెలివరీ రంగాల్లో ఉద్యోగాలకు కొదవలేదు. కానీ జీతం మాత్రం ఆశించిన స్థాయిలో ఇవ్వడం లేదు.

English summary
hiring in logistics, BPOs, healthcare, fintech, collections and more. Can it be sustained in the new jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X