వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు: డిసెంబర్‌లోగా అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆదాయపున్న శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్, కేరళ, వివిధ ఆటలు/క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

అధికారిక వెబ్‌సైట్ https://incometaxindia.gov.inలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రిక్రూట్‌మెంట్ కింది రెండు పోస్ట్‌ల కోసం చేయబడుతుంది: టాక్స్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్.

ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్‌మెంట్ 2021: మొత్తం ఖాళీలు
టాక్స్ అసిస్టెంట్ - 05
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - 02

ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్‌మెంట్ 2021: అర్హత

Income Tax Department Recruitment: Apply for Tax Assistant, other various posts

ట్యాక్స్ అసిస్టెంట్ - అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని కలిగి ఉండాలి లేదా తత్సమానంగా విద్యార్హత కలిగివుండాలి. గంటకు 8,000 కీ డిప్రెషన్‌ల డేటా ఎంట్రీ స్పీడ్ కలిగి ఉండాలి.

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణత డిగ్రీ లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి తత్సమాన విద్యార్హతను కలిగి ఉండాలి.

ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్‌మెంట్ 2021: వయోపరిమితి

టాక్స్ అసిస్టెంట్ - అభ్యర్థి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - అభ్యర్థి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్‌మెంట్ 2021: ఎలా దరఖాస్తు చేయాలి?

అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను క్లోజ్డ్ కవర్‌లో సూపర్ స్క్రైబ్ చేసి సమర్పించాలి -- "ఆదాయపు పన్ను శాఖ 2021-22లో స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు", క్రింది చిరునామాకు పంపాలి.

Deputy Commissioner of Income-Tax (HQ)(Admn.)
O/o the Principal Chief Commissioner of Income-Tax, Kerala,
C.R. Building, I.S. Press Road
Kochi 682018.

ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్‌మెంట్ 2021: చివరి తేదీ

డిసెంబర్ 31, 2021 లోపు పైన పేర్కొన్న చిరునామాకు చేరుకోవడానికి దరఖాస్తులను పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా పంపాలి. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, జమ్మూ కాశ్మీర్‌లలో నివాసం ఉండే అభ్యర్థులు జనవరి 14, 2022లోగా దరఖాస్తులను పంపాలి.

ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్‌మెంట్ 2021: అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి

అభ్యర్థులకు నిబంధనలు, షరతులు, సూచనలతో పాటు దరఖాస్తు ఫారమ్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ www.incometaxindia.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నోటిపికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(https://incometaxindia.gov.in/Lists/Recruitment%20Notices/Attachments/26/sports-quota-recruitment1-12-21.pdf)

English summary
Income Tax Department Recruitment: Apply for Tax Assistant, other various posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X