Incometaxలో ఉద్యోగాలు: టాక్స్ ఇన్స్‌పెక్టర్ టాక్స్ అసిస్టెంట్ పోస్టులకు అప్లయ్ చేయండి
ఆదాయపు పన్ను శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పోర్ట్స్ కోటాలో ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్‌పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ ఫిబ్రవరి 2, 2021.
సంస్థ పేరు: ఆదాయపు పన్ను శాఖ
పోస్టు పేరు: టాక్స్ ఇన్స్‌పెక్టర్, టాక్స్ అసిస్టెంట్,
పోస్టుల సంఖ్య: 14
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 2 ఫిబ్రవరి 2021

విద్యార్హతలు:
ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్‌పెక్టర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
టాక్స్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీతో పాటు గంటలకు 8వేల పదాలతో డేటా ఎంట్రీ స్పీడ్
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియెట్
వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలవడం జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
పూర్తి చేసిన దరఖాస్తులూ స్వీకరణకు చివరితేదీ: 2 ఫిబ్రవరి 2021
అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా:
Principal Chief Commissioner of Income Tax (MP&CG) Aayakar Bhawan,
48 Arera Hills, Hoshangabad Road, Bhopal - 462011.
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.incometaxindia.gov.in/Pages/default.aspx