వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ చదివారా..పోనీ ఫైనలియర్‌లో ఉన్నారా అప్లయ్ చేయండి..!

|
Google Oneindia TeluguNews

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కింద షార్ట్‌లిస్టు అయ్యే అభ్యర్థులు ఇండియన్ మిలటరీ అకాడెమీ డెహ్రాడూన్‌లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 28 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్‌లైన్ దరఖాస్తులు సబ్మిట్ చేసేందుకు చివరితేదీ 26 ఆగష్టు 2020. ఈ కోర్సుకు కేవలం మగవారు మాత్రమే అర్హులు.దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు అవివాహితులై ఉండటంతో పాటు భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది. వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అభ్యర్థి 20 ఏళ్ల నుంచి 27 ఏళ్లు మధ్య ఉండాలి.

ఇక అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ మూడు దశల తర్వాత జరుగుతుంది. ముందుగా దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేయడం, ఆ తర్వాత షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం, చివరిగా మెడికల్ పరీక్షలు నిర్వహించాక అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ముందుగా అర్హతలు, క్వాలిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల దరఖాస్తులను ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆ పై మెడికల్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ రౌండ్‌లో అభ్యర్థులు తమ డాక్యుమెంట్లను తీసుకురావాల్సి ఉంటుంది.

Indian Army Recruitment 2020:Apply for 40 Engineering jobs

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ముందుగా joinindianarmy.nic.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి.

ఆఫీసర్ ఎంట్రీ అప్లయ్/లాగిన్ అనే లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

రిజిస్ట్రేషన్ తర్వాత ఆన్‌లైన్ లింక్ పై క్లిక్ చేయండి

సరైన వివరాలతో కనిపించే ఫారంను పూర్తి చేయండి

పూర్తిగా ఫారంను వివరాలతో పూర్తి చేశాకా తప్పులు ఏమైనా ఉంటే మరోసారి ఎడిట్ చేసి సరైన వివరాలతో పూర్తి చేయండి

పూర్తి చేసిన ఫారంను ప్రింట్ అవుట్ తీసుకుని భవిష్యత్తు అవసరాల కోసం దగ్గర పెట్టుకోండి.

English summary
Indian Army is inviting applications for 40 vacancies in Indian Army engineering recruitment 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X