వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే రిక్రూట్‌మెంట్ - 16 వేలకు పైగా అప్రెంటిస్ పోస్టులు : భర్తీ నోటిఫికేషన్లు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

రైల్వేలో భారీ ఎత్తున అప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక జోన్ల పరిధిలో ఈ పోస్టు భర్తీ కోసం నోటిఫికేషన్లను జారీ చేసారు. ఈ పోస్టులకు సంబందించి జోన్ల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దక్షిణ మధ్య రైల్వే, తూర్పు రైల్వే, పశ్చిమ మధ్య రైల్వేతో సహా వివిధ జోన్లలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా రైల్వే అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తుకు అవకాశం కల్పించారు.

తూర్పు రైల్వే రిక్రూట్‌మెంట్

తూర్పు రైల్వే రిక్రూట్‌మెంట్

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ తూర్పు రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 4 అక్టోబర్ 2021 నుంచి కొనసాగుతోంది. అభ్యర్థులు ఈ పోస్టులకు అధికారిక వెబ్‌సైట్ www.rrcer.com ద్వారా 3 నవంబర్ 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 3366 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

వెస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ

వెస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ

అదేవిధంగా పశ్చిమ మధ్య రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 11 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ wcr.indianrailways.gov.in ద్వారా 10 నవంబర్ 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 2226 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

 దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే ద్వారా అప్రెంటీస్‌ల ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 4 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ద్వారా 3 నవంబర్ 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 4103 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం మరిచిపోవద్దు.

అర్హత

అర్హత


రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సి) జారీ చేసిన నోటీసు ప్రకారం.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10, 12వ ఉత్తీర్ణత కలిగి ఉండటం తప్పనిసరి. అలాగే అభ్యర్థి సంబంధిత స్ట్రీమ్‌లో ITI డిగ్రీని కలిగి ఉండాలి. అదే విధంగా.. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే, ప్రయాగ్‌రాజ్ అప్రెంటిస్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 1664 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

English summary
Railway recuitment cell called applitcations for fill up above 16 thousand apprentice posts in four zones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X