వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IOCLలో ఉద్యోగాలు: డిప్లొమా/ఐటీఐ చేశారా... ఏపీ తెలంగాణలోని కంపెనీల్లో జాబ్ ఆఫర్..!!

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)‌లో దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్నాటకల్లో ఉన్న కంపెనీల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 480 పోస్టులను భర్తీ చేయనుంది.

ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ( ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్‌ట్రుమెంట్ మెకానిక్, మెకానిస్ట్) టెక్నీషియన్ అప్రెంటిస్( మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్‌ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్) ట్రేడ్ అప్రెంటిస్ (అకౌంటెంట్) ట్రేడ్ అప్రెంటిస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) ట్రేడ్ అప్రెంటిస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్) ట్రేడ్ అప్రెంటిస్ (రీటెయిల్ సేల్స్ అసోసియేట్), ట్రేడ్ అప్రెంటిస్ (రీటెయిల్ సేల్స్ అసోసియేట్ స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్)పోస్టులను భర్తీ చేయనుంది.

IOCL Recruitment 2021:Apply for 480 Apprenctice posts

విద్యార్హతలు
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు: అభ్యర్థులు ఆయా సంబంధిత ట్రేడ్‌లో గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి రెండేళ్లు ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి.
టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు: అభ్యర్థులు ఆయా విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మూడేళ్ల పాటు డిప్లొమా చేసి ఉండాలి

ట్రేడ్ అప్రెంటిస్ (అకౌంటెంట్)- గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి

ట్రేడ్ అప్రెంటిస్ (డేటా ఎంట్రీ) ఫ్రెషర్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పాస్ అయిఉండాలి.. డిగ్రీ చేసి ఉండకూడదు

ట్రేడ్ అప్రెంటిస్ (రీటెయిల్ సేల్స్ అసోసియేట్) -గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పాస్ అయిఉండాలి.. డిగ్రీ చేసి ఉండకూడదు

అభ్యర్థుల వయసు విషయానికొస్తే 2021 జూన్ 30 నాటికి కనీస వయస్సు 18 ఏళ్లు గరిష్ట వయసు 24 ఏళ్లుగా ఉండాలి. ప్రభుత్వ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీలకు 29 ఏళ్లు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్‌కు 27 ఏళ్లు ఉండాలి. ఇక దివ్యాంగులకు 10 ఏళ్లు పాటు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అర్హులైన అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని సంస్థ జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసేందుకు చివరితేది 28 ఆగష్టు 2021. మరి ఆలస్యం చేయకుండా వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అన్ని అర్హతలు ఉంటే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ ఇదే: https://www.iocl.com/pages/careers-overview

English summary
Indian oil Corporation limited has issued a notification to fill up Apprentice posts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X