ISRO Recruitment 2020: సైంటిస్టు పోస్టులకు అప్లయ్ చేసుకోండి..!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 55 సైంటిస్టు, ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీ అహ్మదాబాదులోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ కోసమని ఇస్రో పేర్కొంది. మార్చిలో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ అక్టోబర్ 15 వరకు చివరి తేదీ పొడిగించడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను ఆన్లైన్లో పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: ఇస్రో
పోస్టు పేరు: సైంటిస్టు, ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 55
జాబ్ లొకేషన్: అహ్మదాబాదు
దరఖాస్తుకు చివరి తేదీ: 15 అక్టోబర్ 2020

విద్యార్హతలు:
సైంటిస్టు / ఇంజినీర్: మొత్తం 21 పోస్టులు భర్తీ చేయనుంది. ఎలక్ట్రానిక్స్ , ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఎంఈ లేదా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, మరియు ఎలక్ట్రికల్ ఇంజినీరంగ్లలో ఎంటెక్ పీహెచ్డీ ఉండాలి
టెక్నికల్ అసిస్టెంట్: ఇందులో మొత్తం 6 పోస్టులు భర్తీ చేయనుంది. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లలో డిప్లొమా
టెక్నీషియన్ బీ: ఇందులో మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనుంది, 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసీ ఉన్నవారు అప్లయ్ చేసుకోవచ్చు.
వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా. షార్ట్‌లిస్టు అయిన అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 అక్టోబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://recruitment.sac.gov.in/OSAR/manageAdvertisement.do?action=reqViewAdvertisement