వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఆరోగ్యశాఖలో 3393 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: పరీక్ష లేకుండానే నియామకాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో నిరుద్యోగులకు శుభావార్త. తాజాగా, 3వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీగా ఉన్న పోస్టులకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌లో వైద్య సేవలు అందించడానికి 3,393 కాంటాక్ట్‌ పద్దతిన మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈ పోస్టుల‌కు కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా కేవ‌లం అకాడ‌మిక్ మెరిట్ ద్వారానే అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుక అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Job notification released from AP Health department

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హతలు:
ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్యర్థి ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:
నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నాటికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 35 ఏళ్లలోపు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ 40 ఏళ్లలోపు) వయసు కలిగి ఉండాలి. ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 6, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

కాగా, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలలో బీఎస్సీ నర్సింగ్‌ మార్కులు ఆధారంగా ఎంపిక ఉంటుంది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తారు. కాంట్రాక్టు విధానంలో నియామకాలు ఉంటాయి. ముందుగా ఏడాది పాటు కాంట్రాక్టు విధానంలో నియమిస్తారు. పనితీరు ఆధారంగా సర్వీసు కొనసాగించే అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన నిరుద్యోగులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

English summary
Job notification released from AP Health department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X