వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిటల్ రూట్‌: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: ఎల్‌డీఎఫ్ సర్కారు బడ్జెట్ టార్గెట్

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ ఆర్థిక మంత్రి టీఎం థామస్ ఇసాక్.. లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్) ప్రభుత్వ వార్షిక బడ్జెన్‌ను ప్రవేశపెట్టారు. ఉద్యోగ కల్పన, సాంఘిక సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్‌ను ఆవిష్కరించారు. వచ్చే ఐదేళ్లలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు.

ఇంటి నుంచి పనిచేయాలనుకునే మహిళలు, ఇతర ఉద్యోగాలు చేయాలనుకునే మహిళల రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. కేరళలో సుమారు 5 లక్షల మంది మహిళలు కరోనా కారణంగా ఇంటికే పరిమితమయ్యారని, మరో 40 లక్షల మంది విద్యావంతులైన మహిళలు ఇంటి నుంచే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

16 లక్షల మంది యువత ఎప్లాయ్‌మెంట్ ఎక్చేంజీలో రిజిస్ట్రేషన్ చేయించున్నారని, ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని తెలిపారు. 60 లక్షల మందిలో 20 లక్షల మందికి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.

 Kerala Budget Aims to Provide 20L Jobs in Next 5 Yrs Through Digital Route

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మందికిపైగా ఇంటి నుంచే ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. కరోనా కారణంగా ఇంటి నుంచి పనిచేసే వారి సంఖ్య 3 కోట్లకు పెరిగిందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 18 కోట్లకు చేరుకుంటుందని, రానున్న కాలంలో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలే ఎక్కువగా ఉంటాయన్నారు.

రూ. 20 కోట్లతో మున్సిపల్ స్థాయి భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. కంపెనీలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు తగిన పరిస్థితులు కల్పిస్తామని వెల్లడించారు.
కంపెనీలు ఎంపిక చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం తగిన విధంగా సాయం అందజేస్తుందన్నారు. కంప్యూటర్లు, ఇతర సామాగ్రి కొనుగోలు చేసేందుకు తగిన ఆర్థిక సాయం కూడా అందిస్తామని తెలిపారు.

కేరళ ఫైనాన్స్ కార్పొరేషన్(కేఎఫ్‌సీ), కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(కేఎస్ఎఫ్ఈ), కేరళ బ్యాంకులు ఇందుకు రుణాలందిస్తాయని తెలిపారు. రెండేళ్లలో ఈ రుణాలను నెలవారీగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఉద్యోగం వచ్చిన తర్వాతనే రుణాలు చెల్లింపు మొదలవుతుందన్నారు.

ప్రావిడెంట్ ఫండ్ యజమాని సహకారం ప్రభుత్వం చేత పంపబడుతుంది, పీఎఫ్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోతే, పదవీ విరమణపై చెల్లించాల్సిన ముగింపు ప్రయోజనాల కోసం బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది, ఆరోగ్య బీమా కూడా అందించబడుతుందని మంత్రి వివరించారు.

English summary
Kerala's finance minister TM Thomas Isaac unveiled the Left Democratic Front (LDF) government's annual Budget on Friday, with an emphasis on job creation and social welfare schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X