• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెకానిక్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్: మేనేజర్ పోస్టులకు వెంటనే అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

మెకాన్ లిమిటెడ్ పలు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 25,2021 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మేనేజిరియల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకాన్ అధికారిక వెబ్‌సైట్ meconlimited.co.inను సంప్రదించి ఆన్‌లైన్ ద్వారా చివరి తేదీలోగా దరఖాస్తు చేయాలి.

ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 78 మేనేజిరియల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మెకాన్ లిమిటెడ్ సంస్థ తెలిపింది.

అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు:

 MECON Limited Executive Recruitment 2021: Apply now for 78 Managerial posts

మొత్తం భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య 78

డిప్యూటీ మేనేజర్: 7 పోస్టులు
మేనేజర్: 22 పోస్టులు
సీనియర్ మేనేజర్: 4 పోస్టులు
ఏజీఎం: 2 పోస్టులు
డీజీఎం: 3 పోస్టులు
జీఎం: 5 పోస్టులు

అర్హత:

పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న వివరణాత్మక నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత, వయోపరిమితిని తనిఖీ చేయవచ్చు.
http://orclsvr.meconinfo.co.in

ఎంపిక ప్రక్రియ

ఎంపిక విధానం వ్యక్తిగత ఇంటర్వ్యూ.

ఇంటర్వ్యూ కోసం తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా మెకాన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థులు పూరించిన వారి రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడీ ద్వారా ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదిక గురించి వారికి తెలియజేయబడుతుంది.

దరఖాస్తు రుసుం:

జనరల్/ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) / ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన అభ్యర్థులు నాన్-రిఫండబుల్ ఫీజు రూ.1000/- చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ / మాజీ-సైనికులు లేదా అంతర్గత అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయించబడ్డారు.

English summary
MECON Limited Executive Recruitment 2021: Apply now for 78 Managerial posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X