వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Jobs:ఓషియెన్ టెక్నాలజీలో 237 సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్

|
Google Oneindia TeluguNews

ఇంజినీరింగ్ చేసిన వారికి నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఓషియెన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) గుడ్ న్యూస్ తెలిపింది. ఇంజినీరింగ్ చేసిన వారు సైంటిస్టు పోస్టులకు అప్లయ్ చేసుకోవాలని కోరుతూ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రాజెక్టు సైంటిస్టు, ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్, ప్రాజె్టు టెక్నీషియన్, ప్రాజెక్టు జూనియర్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఇలా మొత్తం 237 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఓషియెన్ టెక్నాలజీ.

అభ్యర్థుల రిక్రూట్‌మెంట్ ప్రాజెక్టు ఆధారంగా ఉంటుంది. ఇక ఏ విభాగానికి ఎన్ని పోస్టులున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాజెక్టు సైంటిస్టు -III నాలుగు పోస్టులు, ప్రాజెక్టు సైంటిస్టు -II 30 పోస్టులు, ప్రాజెక్టు సైంటిస్టు-I 73పోస్టులు, ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ 64 పోస్టులు, ప్రాజెక్టు టెక్నీషియన్ 28 పోస్టులు, ప్రాజెక్టు జూనియర్ అసిస్టెంట్ 25 పోస్టులు, రీసెర్చ్ అసోసియేట్ 3 పోస్టులు, సీనియర్ రీసెర్చ్ ఫెలో 8 పోస్టులు జూనియర్ రీసెర్చ్ ఫెలో 2 పోస్టులు ఉన్నాయి.

NIOT Recruitment 2021:Apply for 237 scientist posts

ఇక విద్యార్హతల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. ఆయా విభాగంకు సంబంధించి ఇంజినీరింగ్ డిగ్రీ చేయడంతో పాటు పని అనుభవం తప్పనిసరి అని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభ్యర్థుల కనీస వయస్సు 28 నుంచి గరిష్టంగా 50 ఏళ్లుగా నిర్ణయించింది. ప్రాజెక్టు సైంటిస్టు మరియు రీసెర్చ్ ఫెలోస్ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక మిగతా పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 13 సెప్టెంబర్ 2021.ఇక పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి:

ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు నెలకు ఇలా ఉంటాయి:

ప్రాజెక్టు సైంటిస్టు -III - రూ. 78,000/- + హెచ్‌ఆర్‌ఏ

ప్రాజెక్టు సైంటిస్టు -II - రూ. 67,000/- + హెచ్‌ఆర్‌ఏ

ప్రాజెక్టు సైంటిస్టు-I-రూ. 56,000/- + హెచ్‌ఆర్‌ఏ

ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ -రూ. 20,000/- +హెచ్‌ఆర్‌ఏ

ప్రాజెక్టు టెక్నీషియన్-రూ. 17,000/- + హెచ్‌ఆర్‌ఏ

ప్రాజెక్టు జూనియర్ అసిస్టెంట్-రూ. 18,000/- + హెచ్‌ఆర్‌ఏ

రీసెర్చ్ అసోసియేట్ -రూ. 47,000/- +హెచ్‌ఆర్‌ఏ

సీనియర్ రీసెర్చ్ ఫెలో -రూ. 35,000/- +హెచ్‌ఆర్‌ఏ

జూనియర్ రీసెర్చ్ ఫెలో -రూ. 31,000/- +హెచ్‌ఆర్‌ఏ

English summary
National Institute of Ocean Technology had issued a notification to fill up Project Scientist,Project Scientific Assistant, Project Technician and other posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X