వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Jobs: CISFలో 451 ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో 451 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి శుభవార్త చెప్పింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ పరిశ్రమల భద్రత నిమిత్తం కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్- ఫైర్‌ సర్వీస్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.

రూ.69,100 వేతనం

రూ.69,100 వేతనం

ఈ ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 22లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక వారికి నెలకు రూ.21,700 - రూ.69,100 వేతనం ఇస్తారు. మొత్తం 451 ఉద్యోగాలాల్లో కానిస్టేబుల్/ డ్రైవర్ 183 పోస్టులు ఉన్నాయి. యూఆర్‌- 76, ఎస్సీ- 27, ఎస్టీ- 13, ఓబీసీ- 49, ఈడబ్ల్యూఎస్‌- 18 ఉన్నాయి. కానిస్టేబుల్/ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ 268 పోస్టులు ఉన్నాయి. యూఆర్‌- 111, ఎస్సీ- 40, ఎస్టీ- 19, ఓబీసీ- 72, ఈడబ్ల్యూఎస్‌- 26 ఉన్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్

డ్రైవింగ్ లైసెన్స్

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్(హెవీ మోటార్ వెహికల్ )తో పాటు మూడేళ్ల డ్రైవింగ్‌ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఎత్తు 167 సెం.మీ., ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి. దరఖాస్తు రుసుము: రూ.100 కాగాఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. మొదటగా ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

అటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 225 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ఎకనామిస్ట్‌-02, సెక్యూరిటీ ఆఫీసర్-03, సివిల్ ఇంజినీర్-10, లా ఆఫీసర్-03, ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్-04, డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్-50, బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్-02, ఎలక్ట్రికల్ ఇంజినీర్-15, రాజభాష ఆఫీసర్‌-10, హెచ్‌ఆర్‌/ పర్సనల్ ఆఫీసర్-05, డేటా అనలిటిక్స్-03, ఏపీఐ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్ (2/ 3)-11, డిజిటల్ బ్యాంకింగ్, మేనేజర్-05,
ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్-10, మొబైల్ యాప్ డెవలపర్-10, డాట్ నెట్ డెవలపర్-10, మిగతా ఉద్యోగులు 71 ఉన్నాయి.

విద్యా అర్హత

విద్యా అర్హత

సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయస్సు కనిష్ఠంగా 25, గరిష్ఠంగా 35, 38 సంవత్సరాలు మించకూడదు. పోస్టులను బట్టి మారుతుంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 6 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా ఉంది.

English summary
Central Industrial Security Force has invited online applications from eligible male candidates for the recruitment of Constable (Driver), Constables (Driver-cum-Pump-Operator- Fire Service) posts for the security of public sector industries across the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X