వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Jobs: 12,523 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు నోటిఫికేషన్..

ఎస్సెస్సీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.

|
Google Oneindia TeluguNews

చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా ఉంటుంది. అయితే వారు కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పైనే దృష్టి సారిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చాలానే ఉంటాయి. అందులో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) నిర్వహించే మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) నాన్‌ టెక్నికల్, హవల్దార్‌ పోస్టులకు ప్రకటన నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలుగు మాధ్యమం

తెలుగు మాధ్యమం

ఈ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయితే చాలు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి పాస్ అయిన వారికి ఇంగ్లీష్, హిందీలో పరీక్ష ఎలా రాస్తారని మీకు డౌట్ రావొచ్చు. కానీ ఇప్పుడు ప్రశ్నపత్రాన్ని తెలుగు మాధ్యమంలోనే ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల వరకు జీతం ఉంటుంది.

వల్దార్‌ రెండూ లెవెల్‌-1

వల్దార్‌ రెండూ లెవెల్‌-1

ఎంటీఎస్ ఉద్యోగాల్లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, హవల్దార్‌ రెండూ లెవెల్‌-1 పోస్టులు ఉంటాయి. వీరికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అన్నీ కలిపి వీరు రూ.30,000 జీతం అందుకుంటారు. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు ఎంపిక అయిన దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది.

270 మార్కులు

270 మార్కులు

పరీక్షలో 270 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. మొదటి సెషన్ లో న్యూమరికల్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండింటిలో ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున 40 ప్రశ్నలు వస్తాయి. రెండో సెషన్ లో జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ సెషన్‌లో నెగటివ్ మార్కులు ఉంటాయి.

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు

హవల్దార్‌ పోస్టులకు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో వాక్ చేయాల్సి ఉంటుంది. మహిళలు ఒక కిలోమీటర్‌ను 20 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. పురుషులు 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరిగి 81 సెం.మీ. ఉండాలి. మహిళలు 152 సెం.మీ. ఎత్తు, 48 కి.గ్రా. బరువు ఉండాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు

ఆన్‌లైన్‌ దరఖాస్తులు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ తుది గడువు ఫిబ్రవరి 17 వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ లో పరీక్ష నిర్వహిస్తారు.

English summary
Most people aim for a government job. But they focus only on state government jobs. But there are many central government jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X