వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్: ఇంజినీరింగ్ ఉద్యోగాలు, రూ. 60వేల వరకు జీతం

|
Google Oneindia TeluguNews

దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) తాజాగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 16నే ప్రారంభమైంది.

దరఖాస్తుకు నవంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఉత్తరాఖండ్‌లో పని చేయాల్సి ఉంటుంది.

 NTPC Recruitment 2021: Salary up to Rs 60000 Per Month, Apply now

మెకానికల్ (ఎగ్జిక్యూటివ్ హైడ్రో)- 5
సివిల్(ఎగ్జిక్యూటివ్ హడ్రో సివిల్)- 10

విద్యార్హతలు:

మెకానికల్ ఇంజినీర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

సివిల్ ఇంజినీర్: సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వేతనం వివరాలు:

ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల వేతనం చెల్లించనున్నారు. ఇంకా హెచ్ఆర్ఏ/ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి.

వయో పరిమితి:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థుల గరిష్ట వయస్సును 35 ఏళ్లుగా నిర్ణయించారు.

దరఖాస్తు ఇలా చేయండి..:

మొదటగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://careers.ntpc.co.in/ సంప్రదించాలి.

Current opening విభాగంలో 'Recruitment of experienced Mechanical & Civil engineers..' పేరుతో ప్రకటన ఉంటుంది. దాని కింద 'Click here to apply' లింక్ పై క్లిక్ చేయాలి.

Functional Areaను ఎంచుకుని సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

జాబ్ టైటిల్, పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, జెండర్ విద్యార్హతల వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ఎస్ఎం కేటగిరీ, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవచ్చు.

English summary
NTPC Recruitment 2021: Salary up to Rs 60000 Per Month, Apply now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X