వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Railway Recruitment 2021: భారీగా ఉద్యోగాలు: 10 పాసయ్యారా అయితే అప్లయ్ చేయండి..!

|
Google Oneindia TeluguNews

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేశాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేలో ఉద్యోగం పొందాలనుకునేవారికి ఇదొక సదవకాశంగా చెప్పుకోవచ్చు. భారతీయ రైల్వేస్‌లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే కొత్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఖాళీగా ఉన్న 3378 పోస్టులను భర్తీ చేయనుంది. ఇవన్నీ అప్రెంటిస్ పోస్టులు కావడం విశేషం. పెరంబూర్‌లోని గ్యారేజ్ వర్క్స్, సెంట్రల్ వర్క్‌షాప్‌, సిగ్నల్ మరియు టెలికాం వర్క్‌షాప్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 30 జూన్ 2021లోగ దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులన్నీ ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది.

Recommended Video

Railway Jobs 2021 : Andhra Pradesh లో ఆ రెండు జిల్లాలకే ఛాన్స్ ! || Oneindia Telugu

దక్షిణ రైల్వేస్ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనకు అప్లయ్ చేసుకునే ఆసక్తిగల అభ్యర్థులు ఈ అర్హతలు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 10వ తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక వయస్సు విషయానికొస్తే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 15 ఏళ్లు గరిష్ట వయసు 24 ఏళ్లు ఉండాలని ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వం అమలు చేస్తోన్న రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీని ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులకు రిజర్వేష్లను ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం వర్తిస్తాయి.

Railway Recruitment 2021:Apply for 3378 Apprentice posts in southern Railways

ఇక దరఖాస్తులను ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ మే 31వ తేదీన ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీగా దక్షిణ రైల్వేస్ నిర్ణయించింది. కాబట్టి అభ్యర్థులు ఈలోపు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ, మహిళా అభ్యర్థులకు, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తుండగా... ఇతర జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజులో భాగంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆన్‌లైన్ పేమెంట్ చేయొచ్చు.

ఇక అభ్యర్థులను ముందుగా మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. అనంతరం వారికి పలు పరీక్షలు నిర్వహించి ఆపై సెలెక్ట్ చేస్తారు. ఇక ఎంపికైన అభ్యర్థులు అందరూ తమిళనాడులోని పెరంబూర్ గ్యారేజ్ వర్క్‌షాప్‌లో పనిచేయాల్సి ఉంటుంది. వేతనం వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌చూడగలరు.

https://sr.indianrailways.gov.in/

English summary
Southern Railway has issued the latest notification for the Southern Railway Apprentice recruitment 2021 of Apprentice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X