
టీసీఎస్‌లో 70వేలకుపైగా ఉద్యోగాలు: ఎస్బీఐ పీవో రిక్రూట్మెంట్, భారీ జీతాలు, ఇలా అప్లై చేయండి
పలు సంస్థలు తమ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేసుకునేందుకు నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ తగిన ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వారం, పదిరోజుల్లో దరఖాస్తు చేసుకోవాల్సిన పలు నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 అప్రెంటీస్ పోస్టులు:
భారతీయ రైల్వేస్ సౌత్ సెంట్రల్ రైల్వే 4103 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు scr.indianrailways.gov.in వెబ్ సైట్ సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 3, రాత్రి11.59 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయి.
గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులైన, ఐటీఐ సెర్టిఫికేట్ పొందని అభ్యర్థులు అప్రెంటిసిషిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పరీక్షలు, ఐటీఐ పరీక్షల్లో పొందిన మార్కులను బట్టి ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది. రాత పరీక్ష కానీ, వైవా కానీ లేదు. అయితే, మెడికల్ పరీక్ష మాత్రం పూర్తి చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 4, 2021 నాటికి అభ్యర్థులు 15 ఏళ్లు నిండి ఉండాలి. 24 ఏళ్లు దాటకూడదు. రిజర్వేషన్ ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వయస్సు సడలింపులు ఉంటాయి.

ప్రెషర్స్ కోసం టీసీఎస్‌లో 77వేల ఉద్యోగాలు
2022 ఆర్థిక సంవత్సరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) 77,000 మంది ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోనుందని ఆ కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. మొదటగా 40వేల మంది ఫ్రెషర్స్‌ను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే 43వేల మందిని క్యాంపస్ హైరింగ్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. దీనికి అదనంగా మరో 34వేల మంది ఫ్రెషర్స్ ను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. టెక్ టీం డిమాండ్ ఉండటంతో రిక్రూట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సుమారు 18 నెలలపాటు ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలోకి తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వర్చువల్ విధానంలో ట్రైనింగ్ కొనసాగుతోందని, కరోనా మహమ్మారి పూర్తిగా సమసిపోయిన తర్వాత భౌతిక శిక్షణా తరగతులుంటాయని వివరించారు. ఇప్పటికే 1500 విద్యార్థులకు ఎన్ రోల్ చేసినట్లు తెలిపారు. ప్రతివారం డిజిటల్ సెర్టిఫికేషన్ ప్రోగ్రాం జరుగుతోందన్నారు. శిక్షణ అనంతరం వివిధ శాఖలకు తీసుకోవడం జరుగుతోందని, ఫ్రెషర్స్ కు కూడా తమ కంపెనీలో అత్యుత్త జీతాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వార్షిక ప్యాకేజీ 3.5 లక్షల కంటే ఎక్కువగానే ఉంటుందని తెలిపారు.

ఎస్బీఐ పీవో రిక్రూట్మెంట్.. జీతం 63వేల వరకు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్స్(పీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 2056 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలి. మూడు రౌండ్ల పరీక్షలు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష నవంబర్-డిసెంబర్ మధ్య కాలంలో జరిగే అవకాశం ఉంది. అయితే, ఖచ్చితమైన తేదీ ఇంకా ఖరారు కాలేదు.
ఎంపికైన అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా శిక్షణా తరగతులుంటాయి. ఆ తర్వాత ఉద్యోగంలో చేరిక ఉంటుంది. మూడేళ్లపాటు బ్యాంకులో పనిచేస్తామని రూ. 2 లక్షల విలువైన బాండ్ పేపర్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.
విద్యార్హత: డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యూయేషన్ డిసెంబర్ 31లోగా పాస్ అయి ఉండాలి.
వయోపరిమితి: ఏప్రిల్ 1, 2021 నాటికి 21 ఏళ్లకు మించి ఉండాలి. అలాగే 30 ఏళ్లకు లోబడి ఉండాలి.
దరఖాస్తు ఎలా చేయాలి?
sbi.co.inను సంప్రదించాలి
ఎగువ కుడి మూలన ఉన్న కెరీర్లపై క్లిక్ చేయండి
స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల క్రింద అప్లై నౌ లింక్‌పై క్లిక్ చేయండి
వివరాలను ఉపయోగించి నమోదు చేసుకోండి
ఫారమ్‌ను పూరించండి, డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి
ఫీజు చెల్లించండి, సమర్పించండి
జీతం వివరాలు: బేసిక్ పే రూ. 41,960, 36,000 నుంచి 63,840 వరకు నాలుగు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి.
ప్రిలిమినరీ పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది, మూడు విభాగాలుగా విభజించబడుతుంది - ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ.
పరీక్షను పరిష్కరించడానికి విద్యార్థులకు ఒక గంట సమయం లభిస్తుంది. ప్రిలిమ్స్‌లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితా డ్రా చేయబడుతుంది.
సెక్షనల్ కట్-ఆఫ్ ఉండదు. ప్రతి కేటగిరీలో 10 రెట్లు ఖాళీలు ఉన్న అభ్యర్థులు మెయిన్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు.