
25,271 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్: జీతం రూ. 69వేల వరకు, వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది నిజంగా తీపికబురే. తాజాగా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరగనున్న ఈ నియామకంలో భాగంగా 25, 271 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మహిళలకు 2847 పోస్టులున్నాయి.
నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
భర్తీ చేయనున్న పోస్టులు, అర్హతలు:
నోటిఫికేషన్లో భాగంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల ఖాళీలను భర్తీ చేయనున్నారు. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

గమనించాల్సిన విషయాలు:
ఆసక్తి,
అర్హత
ఉన్న
అభ్యర్థులు
ఆన్లైన్
విధానంలో
దరఖాస్తు
చేసుకోవాలి.
అప్లై
చేసుకునే
అభ్యర్థులు
పురుషులు
రూ.100
ఫీజు
చెల్లించాల్సి
ఉంటుంది.
మహిళలు,
ఎస్సీ,
ఎస్టీ,
ఎక్స్-సర్వీస్‌మెన్
అభ్యర్థులకు
ఫీజు
లేదు.
ఎంపికైన
అభ్యర్థులకు
రూ.21,700
నుంచి
రూ.69,100
వరకు
ఉన్న
గ్రేడ్
3
స్థాయి
వేతనం
ఉంటుంది.
అభ్యర్థులను
కంప్యూటర్
ఆధారిత
పరీక్ష
,
ఫిజికల్
ఎఫిషియెన్సీ
టెస్ట్,
ఫిజికల్
స్టాండర్డ్
టెస్ట్,
వైద్య
పరీక్షల
ఆధారంగా
ఎంపిక
చేయడం
జరుగుతుంది.
దరఖాస్తుల
స్వీకరణ
ప్రక్రియ
జులై
17న
ప్రారంభం
కాగా,
ఆగస్టు
31న
ముగియనుంది.
పరీక్ష
తేదీని
త్వరలోనే
వెల్లడించనున్నారు.
Recommended Video
నోటిపికేషన్‌కు సంబందించిన మరిన్ని వివరాల కోసం https://ssc.nic.in/ వెబ్సైట్ సంప్రదించండి.