వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టేబ్ బ్యాంక్ ఇండియాలో ఉద్యోగాలు: ఎస్ఓ పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బంపర్ ఖాళీలను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ https://www.sbi.co.inలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రెగ్యులర్, కాంట్రాక్టు SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ (SO) స్థానాల్లో 35 ఖాళీలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి.

SBI SCO రిక్రూట్‌మెంట్ 2022: దరఖాస్తు రుసుము:
సాధారణ, OBC, EWS అభ్యర్థులకు, దరఖాస్తు రుసుము రూ. 750.
SC, ST, PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.

State Bank of India Recruitment 2022: SBI announces bumper vacancies

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్:
ఎలా దరఖాస్తు చేయాలి
ఆసక్తిగల అభ్యర్థులు SBI వెబ్‌సైట్ (https://bank.sbi/web/careers)లో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ మొదలైన వాటిని ఉపయోగించి దరఖాస్తు రుసుమును చెల్లించాలి.

అభ్యర్థులు ముందుగా తమ తాజా ఫోటోగ్రాఫ్, సంతకాన్ని స్కాన్ చేయాలి. వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా అభ్యర్థి తన ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేస్తే తప్ప ఆన్‌లైన్ దరఖాస్తులు నమోదు చేయబడవు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తర్వాత, అభ్యర్థులు సిస్టమ్ రూపొందించిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ల ప్రింటౌట్ తీసుకోవాలని సూచించారు.

SBI రిక్రూట్‌మెంట్: చివరి తేదీ

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమైంది. మే 17 వరకు కొనసాగుతుంది. అడ్మిట్ కార్డ్ జూన్ 16 నుంచి అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష తాత్కాలికంగా జూన్ 25న నిర్వహించబడుతుంది.

SBI రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

English summary
State Bank of India Recruitment 2022: SBI announces bumper vacancies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X